జై లవకుశ టైటిల్ ట్రాక్స్ అద్భుతం: మ్యూజిక్ లో దేవిశ్రీ గారడీ చేశాడు. ట్రాక్స్ ఇవే

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సినిమా ‘జై లవకుశ’. ఈ సినిమాలో మొదటిసారి మూడు విభిన్న పాత్రలతో టాలీ వుడ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలయిన ఫస్ట్ లుక్స్, టీజర్లు సినిమా అంచనాలను ఆమాంతం పెంచేశాయి.

దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన జై లవకుశ పాటలు లహరి మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతున్నాయి. పాటలకు సంబంధించిన టైటిల్ ట్రాక్ ను ముందుగా విడుదల చేశారు.

1. కృష్ణా ముకుందా రారే

2. కళ్ళ లోన కాటుక

3. అసురా అసుర

4. స్వప్న సుందరి

ఈ టైటిల్ ట్రాక్స్ చూస్తే  జై లవకుశ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయడం గ్యారంటీ అని తెలుస్తుంది. మరి కొద్ది గంటల్లో పాటల్ని యూట్యూబ్ లో పెట్టబోతున్నారు.

నిజానికి ఆడియో రిలీజ్ కు సంబంధించి భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ. కాకపోతే వర్షాలు, గణేష్ నిమజ్జనంను దృష్టిలో పెట్టుకొని వెనక్కి తగ్గింది. అయితే ఫ్యాన్స్ కోసం ఈనెల 10న భారీ ఈవెంట్ పెడతామని ప్రకటించింది. ఆ రోజు ఆడియో సక్సెస్ ఈవెంట్ ను సెలబ్రేట్ చేయడంతో పాటు థియేట్రికల్ ట్రయిలర్ ను కూడా లాంచ్ చేస్తారు. దసరా కానుకగా ఈనెల 21న రానుంది జై లవకుశ.

More from my site

Comments

comments