రికార్డులు సృష్టిస్తున్న జై లవకుశ

విడుదలయిన మొదటిరోజు నుంచి కలెక్షన్ల వర్షం కురిపించిన జై లవకుశ మొదటి వీకెండ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమా కలెక్షన్లు 100 కోట్ల రూపాయలు దాటినట్లు అధికారికంగా నిర్మాత కళ్యాణ్ రామ్ ప్రకటించారు. బాద్‌షా, నాన్నకు ప్రేమతో సినిమాల కలెక్షన్లను దాటేసి.. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఎక్కువ కలెక్షన్లు సాధించిన జనతాగ్యారేజ్ తర్వాత రెండో స్థానంలో జై లవకుశ నిలిచింది.
ఓవర్సీస్‌లో కూడా ఎన్టీఆర్ సినిమా జై లవకుశ రికార్డులను సృష్టిస్తోంది. ఓవర్సీస్‌లో ఎన్టీఆర్‌ నాలుగు సినిమాలు వరుసగా ఒక మిలియన్ డాలర్ మార్కును దాటాయి. బాద్‌షా కూడా ఓవర్సీస్‌లో ఒక మిలియన్ డాలర్ మార్కును దాటింది. వీటిల్లో బాద్‌షా, టెంపర్ సినిమాల కలెక్షన్లను జై లవకుశ దాటేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా 1.62 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది.
నాన్నకు ప్రేమతో====== 2.02 మిలియన్ డాలర్లు
జనతాగ్యారేజ్====== 1.80 మిలియన్ డాలర్లు
జై లవకుశ====== 1.62 మిలియన్ డాలర్లు
బాద్‌షా======1.28 మిలియన్ డాలర్లు
టెంపర్====== 1.049 మిలియన్ డాలర్లు
total collections

AP/TS – రూ. 71 కోట్లు

కర్ణాటక -రూ. 12 కోట్లు

తమిళనాడు – రూ. 2.50 కోట్లు

ROI – రూ. 2.75 కోట్లు

USA – రూ. 10.50 కోట్లు

ROW -రూ. 5.25 కోట్లు

మొత్తం – రూ. 104 కోట్లు

More from my site

Comments

comments