బ్రేక్ ఈవెన్ దాటిన జై లవకుశ – 30 రోజుల కలెక్షన్స్ డీటెయిల్స్

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన జై లవకుశ సినిమా విడుదలైన వారంలోనే 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూళ్లు రాబట్టి దసరా సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్టు గా నిలిచింది. నాన్ బాహుబలి సినిమాలలో ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాలలో నెంబర్ వన్ గాను.. ఆల్ టైమ్ తెలుగు సినిమాలలో బాహుబలి రెండవ, మొదటి భాగాల తర్వాత మూడవ స్థానంలోనూ నిలిచింది.

ఇక షేర్ కలెక్షన్ల విషయానికొస్తే ట్రేడ్ పండితుల అంచనాల మేరకు నిన్నటివరకు 81 కోట్ల రూపాయల కలెక్షన్ల షేర్ సాధించి 82 కోట్ల షేర్ మార్కు వైపు పరుగులు తీస్తుంది. నిన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా 81 లక్షల రూపాయల షేర్ వసూలు చేసిన జై లవకుశ మరిన్ని కలెక్షన్లు వసూళ్లు చేస్తుందని అంచనా వేస్తున్నారు. చాలా ఏరియాలలో బయ్యర్లు బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాట పట్టినట్లు తెలుస్తుంది. రాశి ఖన్నా నివేతా థామస్ లు హీరోయిన్లుగా నటించిన జైలవకుశ సినిమాలో స్వింగ్ జరా అంటూ మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ లో మెరిసింది.

ఓవర్ సీస్ లో జై లవకుశ తో మూడు వరుస 1.5 మిలియన్ల డాలర్ల క్లబ్ లో ఉన్న ఒకే ఒక్క సౌత్ హీరో గా ఎన్టీఆర్ రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. అమెరికాలో 1.7 మిలియన్ డాలర్ల మార్కు దాటి 2 మిలియన్ల కలెక్షన్ల వైపు పరుగులు పెడుతుంది జై లవకుశ.

More from my site

Comments

comments