జైలవకుశ ఫస్ట్ లుక్…విక్రమ్, కమల్ స్టైల్‌లో…ఆ ఎమోషన్‌తో

జైలవకుశ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యూనిట్ మొత్తం కూడా గుజరాత్ షెడ్యూల్ ప్లానింగ్‌లో బిజీగా ఉన్నారు. సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ అక్కడే జరుగుతుంది. ఇప్పటి వరకూ కూడా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ పవర్ఫుల్‌గా ఉంటుందన్న వార్తలు వచ్చాయి కానీ యూనిట్ వర్గాలు మాత్రం ఆ వార్తలను ఖండిస్తున్నాయి. ఇంతకుముందు స్టార్ హీరోలు ట్రిపుల్ రోల్‌లో కనిపించినప్పుడు ఒక హీరో పవర్ఫుల్‌గా ఉండడం…మిగతా వాళ్ళు క్లాస్‌గా కనిపించడం జరిగిందని….కానీ జైలవకుశలో మాత్రం మూడు క్యారెక్టర్స్ కూడా పవర్ఫుల్‌గానే ఉంటాయని చెప్తున్నారు. క్లిక్ అయితే మాత్రం ఎఫెక్ట్ మామూలుగా ఉండదు అనే రేంజ్ కాన్ఫిడెన్స్‌తో యూనిట్ మెంబర్స్ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటి వరకూ షూటింగ్ కంప్లీట్ అయిన సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయని చెప్తున్నారు.

ఈ విషయం ఇలా ఉంటే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అవబోతున్న జైలవకుశ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోంది అన్న నందమూరి అభిమానుల క్యూరియాసిటీకి మాత్రం ఇప్పుడు కొంతవరకూ సమాధానం దొరికింది. సినిమాలో మూడు క్యారెక్టర్స్ చేస్తున్న నేపథ్యంలో….ఎన్టీఆర్‌ లుక్‌పైన చాలానే అంచనాలున్నాయి. ఇప్పుడు ఆ లుక్‌కి సంబంధించిన డిటెయిల్స్ బయటికి వచ్చాయి. ఈ సినిమాకు వర్క్ చేస్తున్న హాలీవుడ్ మేకప్ మేన్ వాన్స్ హర్ట్‌వెల్ లుక్‌కు సంబంధించిన కొన్ని డిటెయిల్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. జైలవకుశ ఫస్ట్ లుక్ అత్యంత క్రూరంగా ఉంటుందని చెప్పాడు. యంగ్ టైగర్ లుక్ భయం కలిగించే స్థాయిలో ఉంటుందని చెప్పి అంచనాలను, క్యూరియాసిటీని ఇంకా పెంచేశాడు. ఇదే విషయాన్ని ఇప్పుడు యూనిట్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. ఒక క్యారెక్టర్ మాత్రం కమల్, విక్రమ్‌ల స్థాయి పెర్ఫార్మెన్స్ ఉండే క్యారెక్టర్ అట. రేపు ఫస్ట్ లుక్ కూడా ఆ క్యారెక్టర్‌దే రివీల్ చేస్తారట. ఎన్టీఆర్ ఎక్స్‌ప్రెషన్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చే స్థాయిలో…..మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చే రేంజ్‌లో ఫస్ట్ లుక్ ఉంటుందని ఎన్టీఆర్ ఆర్ట్స్ మెంబర్స్ చెప్తున్నారు.

More from my site

Comments

comments