జై లవకుశ సునామీ – ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ డీటెయిల్స్

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టిస్తున్నాడు. అటు ప్రీమియర్స్ ద్వారా యూఎస్ ని దడ దడ లాడించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టించాడు. ట్రేడ్ వర్గాలే బెంబేలెత్తేలా అలజడి రేపాడు. తాము వేసిన అంచనాలకంటే తారక్ ప్రభంజనం సృష్టించాడని రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి.

ఓవర్సీస్ లో ఎన్టీఆర్ మార్కెట్ ఇంతకుముందు కన్నా జై లవకుశ సినిమాతో మరింత పెరిగింది. ప్రీమియర్స్ తోనే జనతా గ్యారేజ్ రికార్డ్ బ్రేక్ చేసిన ఎన్టీఆర్ జై లవ కుశతో దుమ్ముదులిపేశాడు. యూఎస్ బాక్సాఫీస్ పై ఎన్.టి.ఆర్ దండయాత్ర అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. ఇక ఈ సినిమా కచ్చితంగా ఎన్.టి.ఆర్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తుందని తెలుస్తూనే ఉంది. రిలీజ్ నాడే 50 కోట్ల గ్రాస్ తో కలక్షన్స్ ప్రభంజనం సృష్టించిన ఎన్.టి.ఆర్ ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల కలెక్షన్స్, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ 100 కోట్లకి చేరింది. యూఎస్ లో 2 మిలియన్ డాలర్లకి అతి చేరువగా వచ్చింది. ఈ రోజు 10 గంటలకి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది.

More from my site

Comments

comments