జై లవకుశ ఫస్ట్ లుక్ టీజర్ అఫిషియల్ రిలీజ్ డేట్ ఇదే..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ జనతా గ్యారేజ్ తర్వాత చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా జై లవకుశ. కె.ఎస్ రవింద్ర (బాబి) డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసిన తారక్ సినిమా మీద మరింత అంచనాలను పెంచేశాడు.

రాయల్ లుక్ లో జై లవకుశ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ లో మంచి ఉత్సాహాన్ని నింపింది. ఈ క్రమంలో జై లవకుశ ఫస్ట్ లుక్ టీజర్ గురించి ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక అభిమానుల కోరిక మేరకు జూలై ఫస్ట్ వీక్ లో జై లవకుశ టీజర్ రిలీజ్ చేస్తున్నారట. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ అఫిషియల్ ట్వీట్ పేజ్ లో టీజర్ రిలీజ్ కు సంబందించిన విషయం ఎనౌన్స్ చేశారు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం జూలై 5న కళ్యాణ్ రాం పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. నందమూరి సోదరులు ఇద్దరు మొదటిసారిగా కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలైతే తారస్థాయిలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న ఎన్.టి.ఆర్ ఒకటి రెండు కాదు ఏకంగా మూడు డిఫరెంట్ రోల్స్ లో జై లవకుశలో నటించడం అతిపెద్ద హైలేట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేయగా రిలీజ్ అవబోతున్న టీజర్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇక సినిమాను కూడా అనుకున్న విధంగా సెప్టెంబర్ 1న రిలీజ్ చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారట.

More from my site

Comments

comments