జై లవకుశ టీజర్ ప్రభంజనం.. 48 గంటలు కాకముందే కోటి వ్యూస్ తో అల్లకల్లోలం..!

విడుదలైన గంట లోపే 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించిన జై టీజర్ ఆ తర్వాత ఒకొక్క టాలీవుడ్ రికార్డుని బద్దలు కొట్టుకుంటూ కొద్దిసేపటి క్రితం 1 కోటి వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అఫీషియల్ గా చేసిన ఒక ప్రకటనలో తమ టీజర్ ని అభిమానించిన వారికీ కృతఙ్ఞతలు తెలియచేసింది.

ఒక టీజర్ ఎన్ని సంచలనాలు సృష్టించగలదు.. ఒక టీజర్ సినిమా మీద ఎన్ని అంచనాలను పెంచగలదు.. ఒక హీరో సత్తా టీజర్ తోనే సంచలనాలు సృష్టించడానికి వస్తే అదే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ జై లవకుశ టీజర్ అని చెప్పాలి. రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే అంతర్జాలాన్ని అల్ల కల్లోలం చేసిన ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన అతి కొద్ది గంటల్లోనే వేల రికార్డులను సొంతం చేసుకుంది.

అంతేకాదు తాజాగా ఒక హీరో స్టామినా టీజర్ తో తెలుస్తుంది అని చెప్పడానికి ఉదహరిస్తూ రిలీజ్ అయిన కేవలం 48 గంటలు కూడా కాకముందే కోటి (10 మిలియన్) డిజిటల్ వ్యూస్ తో ఎన్.టి.ఆర్ సృష్టిస్తున్న ప్రభంజనం ఇది. రావణాసురగా రాక్షసత్వాన్ని చూపించిన తారక్ టీజర్ నుండే ఇక అన్ని రికార్డులు తన వెనకాలే అని ఫిక్స్ చేసినట్టున్నాడు.

ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాను కె.ఎస్ రవింద్ర అలియాస్ బాబి డైరెక్ట్ చేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

More from my site

Comments

comments