జై ఒక్కడే కాదు….లవకుశులు కూడా షాక్ ఇస్తారట

jai-lavakusha-characters

జైలవకుశ సినిమా యూనిట్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు క్యారెక్టర్స్‌లో కనిపిస్తాడు అనే వార్త నుంచి టైటిల్ రివీలింగ్ వరకూ ఇప్పటికే ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపించాయి. ఇక జై క్యారెక్టర్ గురించి అయితే కొత్తగా చెప్పేదేముంది. ఆ క్యారెక్టర్‌కి శారీరక లోపం ఉంటుందని, అలాగే యాక్షన్ పార్ట్ మొత్తం కూడా ఆ క్యారెక్టర్‌తోనే ఉంటుందని…సినిమాను నిలబెట్టే క్యారెక్టర్ అదేనని వార్తలు వచ్చాయి. అయితే జైలవకుశ టీం నుంచి ఇప్పుడు మరి కొన్ని సర్‌ప్రైజింగ్ వార్తలు తెలిశాయి.

అందరూ అనుకున్నట్టుగానే జై క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ షాకింగ్ న్యూస్ ఏంటంటే మిగతా రెండు క్యారెక్టర్స్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటాయట. ఇప్పటి వరకూ డ్యూయల్ రోల్, ట్రిపుల్ రోల్స్‌లో స్టార్ హీరోలు కనిపించిన సినిమాలన్నింటిలోనూ ఏదో ఒక క్యారెక్టర్ పూర్తి మాసీగా ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఆ క్యారెక్టరే ఇరగదీస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లానో, కామెడీ కోసమో ఉంటారు. అయితే ఇప్పుడు జైలవకుశలో మాత్రం మూడు క్యారెక్టర్స్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయట. అదే ఈ సినిమా స్పెషాలిటీ అని చెప్తున్నారు. ప్రతి క్యారెక్టర్‌లోనూ ఎన్టీఆర్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంటుందని….మూడు క్యారెక్టర్స్‌కి సంబంధించిన క్యారెక్టరైజేషన్ కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉంటుందని చెప్తున్నారు. మొత్తంగా ఈ మూడు క్యారెక్టర్స్ కూడా జనాలకు కనెక్ట్ అయితే మాత్రం జైలవకుశ కలెక్షన్స్ మామూలుగా ఉండవని….ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నింటినీ ఈజీగా కొట్టేస్తుందని యూనిట్ వర్గాలు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాయి. ఎన్టీఆర్‌కి అయితే ఆ స్టామినా ఉంది. బాబీ కూడా ఎన్టీఆర్ స్టామినాకు తగ్గ అవుట్ పుట్ ఇచ్చాడంటే మాత్రం జైలవకుశ సినిమా రిజల్ట్ అంచనాలను మించి అనే స్థాయిలోనే ఉంటుందనడంలో సందేహం లేదు. మామూలుగానే యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడితే….నభూతో అనే రేంజ్‌లో పెర్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తాడు ఎన్టీఆర్. ఇక మూడు క్యారెక్టర్స్….మూడూ కూడా పూర్తి వేరియేషన్ ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ అంటే వదుల్తాడా? అభిమానుల అంచనాలు, ప్రేక్షకుల అంచనాల కంటే కూడా ఎన్నో రె్ట్టు ఎక్కువ స్థాయిలో ఎన్టీఆర్ యాక్టింగ్ ఉంటుంది అని చెప్పడానికి డౌటే అవసరం లేదు. కథ కూడా కనెక్ట్ అయిందంటే కలెక్షన్స్ సునామీ పుడుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏమంటారు?

Related News

Comments

comments