జాలీగా జై ..లవ్లీగా లవ ..ఖుషీగా కుశ …

జూనియర్ ఎన్టీఆర్ స్పీడ్ పెంచేశాడు. ఇప్పటి వరకూ జై లవ కుశ మూవీ ప్రమోషన్స్ వేగం పుంజుకోలేదని అభిమానులు కాసింత టెన్షన్ పడుతుండగా.. ఇప్పడు ఒకదాని వెంట ఒకటి అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . నిన్ననే లవకుమార్ టీజర్ ని రిలీజ్ చేసిన ఎన్టీఆర్ ఈరోజు వినాయకచవితి పర్వదినం కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జై లవకుశ లోని మూడో పాత్ర అయిన కుశ ని రివీల్ చేసారు. కుశ పోస్టర్లను విడుదల చేసిన టీం.. యంగ్ టైగర్ ను ఎనర్జిటిక్ గా చూపించడం విశేషం. పొడుగు జుట్టుతో ఎన్టీఆర్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ కేరక్టర్ ను పక్కాగా మాస్ అఫ్పీల్ తో డిజైన్ విషయాన్ని చెప్పకనే చెప్పారు. కరెన్సీ నోట్ల మధ్య ఫైట్ చేస్తున్నట్లుగా ఇచ్చిన స్టిల్ కొంతమేర బాగుంది. నవ్వుతున్న పోస్టర్ లో బాగానే ఆకట్టుకుంటాడు ఎన్టీఆర్. మొత్తానికి మూడు పాత్రలు కూడా రివీల్ కావడంతో ఇక మూడో టీజర్ కోసం అలాగే ట్రైలర్ కోసం అత్యంత ఆసక్తిగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

సెప్టెంబర్ 3వ తేదీన అంగరంగ వైభవంగా ఆడియో వేడుకని చేసి సెప్టెంబర్ 21న జై లవకుశ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా , నివేదా థామస్ లు నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. పండగ పూట ఎన్టీఆర్ లుక్ , టీజర్ రావడంతో సంతోషంగా ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

 

More from my site

Comments

comments