బుల్లితెరపై యాంకర్‌గా ఎన్టీఆర్……టీఆర్పీ దుమ్ములేచిపోతోంది చూస్కోండి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో సూపర్ స్టెప్ తీసుకున్నాడు. ఇప్పటి వరకూ వెండితరపై తన సత్తా చూపించిన ఎన్టీఆర్ ఇప్పుడిక బుల్లితెరపై సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. అఫ్కోర్స్…….బుల్లితెరపై సంచలనాలు సృష్టించడం ఎన్టీఆర్‌కి కొత్త కాదనుకోండి. ఎన్టీఆర్ యావరేజ్ సినిమాలు కూడా బుల్లితెరపై బీభత్సమైన రేటింగ్స్ రాబట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అవన్నీ కూడా సినిమాల రూపంలోనే. ఇక ఇప్పుడు డైరెక్ట్‌గా బుల్తితెరపైనే తన యాక్టింగ్ టాలెంట్ చూపించబోతున్నాడు ఎన్టీఆర్.

బిగ్ బాష్ లీగ్ కార్యక్రమాన్ని తెలుగులో మాటీవీ వాళ్ళు రూపొందించనున్నారు. ఆల్రెడీ ఈ లీగ్ కోసం తమిళ్‌లో కమల్ హాసన్ యాంకరింగ్ చేయడానికి ఒఫ్పుకున్నాడు. ఇక హిందీలో సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు ఇరగదీస్తున్నారు. అయితే తెలుగులో ఈ యంకరింగ్ కోసం ఎన్టీఆర్ సంప్రదించారు మాటీవీ వాళ్ళు. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాల రేటింగ్స్ పుణ్యమాని చాలా సార్లు నంబర్ ఒన్ స్థానం దక్కించుకుంది మాటీవి. ఇప్పుడిక ఆ ఎన్టీఆర్‌నే బుల్తితెరపైకి తీసుకువస్తే మరోసారి మిగతా ఛానల్స్‌ని బీట్ చేసి నంబర్ ఒన్ స్థానం దక్కించుకోవచ్చని మాటీవీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్‌ని అప్రోచ్ అయిన మాటీవీ టీం ఎన్టీఆర్‌కి భారీ అమౌంట్ ఆఫర్ చేసిందట. అయితే ప్రస్తుతం జైలవకుశ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో, కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమాలు చేయడానికి ఒఫ్పుకున్నాడు. మరి అంత బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో బుల్లితెర యాంకరింగ్‌కి సై అంటాడా? ఎన్టీఆర్ పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే బిగ్ బాస్ షోకి వారానికి ఒక్క రోజు డేట్స్ కేటాయిస్తే చాలు. ఎన్టీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.

More from my site

Comments

comments