కట్టప్పతో శివగామి రొమాంటిక్ సీన్ అదిరింది (వీడియో)

బాహుబలి సినిమాతో చాలా చాలా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు, గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు ప్రభాస్, రాజమౌళిలు అయితే బాహుబలి సినిమాలో బాగా పేరు వచ్చిన రెండు క్యారెక్టర్స్ మాత్రం శివగామి, కట్టప్ప. రొటీన్ కథ అన్న ఫీలింగ్ రాకుండా కొత్తదనాన్ని తీసుకొచ్చింది కూడా ఈ రెండు క్యారెక్టర్సే. మామూలుగా మన రెగ్యులర్ ఇండియన్ సినిమాల్లో హీరో, హీరోయిన్స్ కాకుండా ఇతర క్యారెక్టర్స్ ఇంత బలంగా ఎప్పుడూ ఉండవు. ఈ రెండు క్యారెక్టర్స్ కూడా దాదాపు హీరోతో సమానం అని చెప్పొచ్చు. ఆ రెండు క్యారెక్టర్స్‌లోనూ అంతే అద్భుతంగా నటించి బాహుబలిని నిలబెట్టారు రమ్యకృష్ణ, సత్యరాజ్‌లు. ఇద్దరు కూడా సరిసమానంగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

ఇక ఇప్పుడు ఈ ఇద్దరు ఒక ఆలుమగల మధ్య వచ్చే సెన్సిబుల్ సీన్‌లో అంతే అద్భుతంగా నటించారు. అయితే ఈ నటన మాత్రం బాహుబలి కోసం కాదు. కనీసం సినిమా కోసం కూడా కాదు. కట్టప్ప, శివగామిల పాత్రలతో ఈ ఇద్దరికి వచ్చిన సూపర్ పాపులారిటీని క్యాష్ చేసుకోవడం కోసం ఓ కంపెనీ వీళ్ళిద్దరితో యాడ్ ప్లాన్ చేసింది. ఈ యాడ్‌లో రాజు-రాణి దంపతులుగా సత్యరాజ్ , రమ్యకృష్ణ నటించారు. ఇక్కడ కూడా ఒకరికి ఒకరు ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా నటించారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. బాహుబలిని బాగా ఇష్టపడ్డ ప్రేక్షకులకు అయితే సూపర్ సర్‌ప్రైజ్‌లా ఉంటుందనడంలో సందేహం లేదు.

Comments

comments