‘ఖాకీ’ మూవీ ట్వీట్ రివ్యూ

9:57 AM : కాప్స్ మరియు బందిపోటు దొంగల ముఠా మధ్య పోరాట సన్నివేశాలతో ఈ చిత్రం ముగుస్తుంది. కార్తి విజయవంతంగా అనుకున్నది పూర్తిచేసాడు. సినిమా పూర్తయ్యింది.

9:47 AM : విలన్ గ్యాంగ్స్ అండ్ కాప్స్ మధ్యన కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలతో కథ ముందుకు సాగుతోంది

9:37 AM : చిత్రం ఆసక్తికరమైన సన్నివేశాలతో క్లయిమాక్స్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తున్న సీన్స్ వస్తున్నాయి

9:31 AM : మెయిన్ విలన్ అసలు వివరాలను తెలుసుకోవడానికి ఇప్పుడు పోలీసుల దగ్గర ఒక మంచి ప్లాన్ సిద్ధంగా ఉంది..

9:10 AM : కార్తీ మరియు అతని బృందం దోపిడీల ముఠా వెనుక ఉన్న ఒక మనిషిని వెతకటం ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రక్రియలో, వారు ముఠాలో ఒక వ్యక్తిని పట్టుకుంటారు… ఇప్పుడు కొన్ని విచారణ దృశ్యాలు వస్తున్నాయి

9:05 AM : ప్రస్తుతం ట్రాజెడి తో కూడిన ఒక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో రాజ్ పూత్ చరిత్రకు సంబందించిన సీన్స్ తెరపై ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి..

8:55 AM : చిత్రం కథ రాజస్థాన్ కి మారింది.. దోపిడీ ముఠాలతో ఇప్పుడు కొన్ని ఫైట్ సీన్స్ వస్తున్నాయి

8:52 AM : ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యింది.. వివిధ ప్రదేశాల్లో గ్యాంగ్ ల గురించి తెలుసుకోవడానికి పోలీసులు కొన్ని విశేషాలు సేకరించే దృశ్యాలు వస్తున్నాయి.

8:40 AM : ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటివరకు సినిమా మంచి కథాంశంతో కొనసాగింది.. ఇంటర్వెల్ బ్లాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.. సినిమా సెకండ్ ఆఫ్ పై ఆసక్తిని రేపుతోంది..

8:35 AM : పోలీసులు గ్యాంగ్ ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారు, కొన్ని హార్డ్ హిట్టింగ్ సీన్స్ తో ఒక ఆసక్తికరమైన విరమనికి బ్లాక్ దారితీస్తుంది. ఇప్పుడు ఇంటర్వెల్ పడింది

8:25 AM : ఫైనల్ గా కార్తీ తన దర్యాప్తులో మొట్టమొదటి ఆధారాన్ని కనుగొన్నాడు … ఇప్పుడు నటుడు అభిమన్యు సింగ్ దోపిడీ ముఠా నేతగా ఎంట్రీ ఇచ్చాడు

8:15 AM : పాట పూర్తయింది.. దోపిడీ ముఠా కోసం వేట సాగుతోంది … నేర గిరిజనుల చరిత్రకు సంబంధించిన కొన్ని సీన్స్ వస్తున్నాయి

8:10 AM : కొన్ని సీరియస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ తర్వాత కథలో కొన్ని ఫ్యామిలీ సీన్స్ వస్తున్నాయి..ఇప్పుడు మరో బ్యూటీ ఫుల్ సాంగ్ చిన్ని చిన్ని ఆశలు వస్తోంది..

8:02 AM : భయంకరమైన నేరస్తుల అసలు నిజాలను కార్తీ బయటపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.. ప్రస్తుతం కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ వస్తున్నాయి

7:55 AM : హీరో ఒక దోపిడీకి సంబంధించిన కేసును టేకాఫ్ చేస్తున్నాడు.. కొన్ని ఆసక్తికరమైన క్రైమ్ సీన్స్ తో చిత్రం కథ ముందుకు సాగుతోంది

7:50 AM : కార్తీ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు..కానీ అతను తరచు ట్రాన్స్ ఫర్ అవుతున్నాడు.. ప్రస్తుతం కొన్ని ఫ్యామిలీ సీన్స్ వస్తున్నాయి

7:44 AM : కార్తీ తన పోలీస్ ట్రైనింగ్ ని పూర్తిచేసుకొని హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు హీరో హీరోయిన్ మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి..

7:38 AM : సాంగ్ పూర్తయ్యింది.. కార్తీ మళ్లీ పోలీస్ అకాడమీలోకి వచ్చేశాడు.. ట్రైనింగ్ సీన్స్ వస్తున్నాయి

7:31 AM : కార్తీ హీరోయిన్ రకుల్ కి ఆకర్షితుడయ్యాడు.. ఇప్పుడు సినిమాలోని మొదటి సాంగ్ కళ్ల బొల్లి వస్తోంది.. సాంగ్ చాలా రొమాంటిక్ గా ఉంది

7:28 AM : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విలేజ్ గర్ల్ గా ఇప్పుడే సిన్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. హీరో హీరోయిన్ మధ్య కొన్ని ఇంట్రడక్షన్ సీన్స్ వస్తున్నాయి

7:25 AM : ఇప్పుడు సినిమా కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లింది..కార్తీ అకాడమీలో శిక్షన తీసుకొంటున్న సీన్స్ వస్తున్నాయి

7:20 AM : చెన్నై ప్రాంతంలో కథ మొదలైంది.. కార్తీ పోలీస్ పాత్రలో డైరెక్ట్ గా సిన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు..ప్రస్తుతం కొన్ని పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ వస్తున్నాయి.

7:15 AM : సినిమా ఇప్పుడే మొదలైంది.

Comments

comments