ఇండియా కెప్టెన్ జెర్సీతో లగాన్ కెప్టెన్

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఈ రోజు హైదరాబాద్‌ వేదికగా జరిగే భారత్‌-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌కు బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ ని హాజరవ్వాలని  కోరారు. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా ఇరుజట్లు చెరొక మ్యాచ్‌ గెలిచి తుది సమరానికి సిద్దమైన విషయం తెలిసిందే.

ఓ జాతీయ చానెల్‌ దీపావళి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన చిటాచాట్‌ ప్రోగ్రామ్‌ షూటింగ్‌లో పాల్గొన్న కోహ్లి, అమీర్‌ ఖాన్‌ను హైదరాబాద్‌ మ్యాచ్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అంతేగాకండా చీర్స్‌ గర్ల్స్‌ మధ్య అమీర్ ఖాన్‌ గ్యాలరీలో నిలబడాలని కోహ్లి కోరినట్లు సమాచారం. ఇటీవల అమీర్‌ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ టీవీషో షూట్‌కు కోహ్లి హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లి తన జేర్సీని అమీర్ ఖాన్‌ కి గిఫ్ట్‌గా అందజేశాడు. కోహ్లి కోరిక మేరకు అమీర్‌ఖాన్‌ హైదరాబాద్‌ వచ్చారని, క్రికెటర్లు బస చేసిన హోటల్లోనే బస చేశారని, టీమిండియా క్రికెటర్లను కూడా కలిసినట్లు తెలుస్తోంది. కోహ్లి ఇచ్చిన జెర్సీ ధరించి మరి కొద్ది నిముషాల్లో ప్రారంభమయ్యే ఆఖరి సమరానికి ఖాన్‌ బాయ్‌ హాజరవుతున్నట్లు సమాచారం.

More from my site

Comments

comments