ఈ వార్త వింటే మహేష్ ఫాన్స్ డాన్స్ లు వేస్తారు !!

మహేష్ ఇప్పుడు మురుగదాస్ డైరెక్షన్ లో స్పైడర్ లో నటిస్తుండగా…. తన నెక్స్ట్ మూవీ ని కొరటాల డైరెక్షన్ లో చేస్తున్నాడు. అయితే కొరటాల మూవీ అవ్వగానే రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ నటిస్తాడని అంటున్నారు. ఎందుకంటే రాజమౌళి బాహుబలి మొదటి పార్ట్ పూర్తయ్యాక ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మహేష్ తో ఒక సినిమా చెయ్యడానికి కమిట్మెంట్ ఉందని… సో.. త్వరలోనే మా కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రకటించడంతో మహేష్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కానీ ఇపుడు పార్ట్ 2 కూడా రిలీజ్ అయ్యింది కాబట్టి రాజమౌళి, మహేష్ ని డైరెక్ట్ చెయ్యొచ్చనే ఊహాగానాలు బయలుదేరాయి.

బాహుబలి తర్వాత ఏదన్న ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ని తెరకెక్కించిన తర్వాత మహేష్ తో సినిమా చెయ్యాలనే ఆలోచనలో జక్కన్న ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణకు రాజమౌళి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నారాయణ నిర్మాణ సారధ్యంలో సినిమా చేస్తానని రాజమౌళి ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆ సినిమా చెయ్యలేదు. ఇప్పుడు బాహుబలి సినిమా విడుదలైంది కాబట్టి రాజమౌళి నారాయణతో టచ్ లోకి వచ్చి సినిమా చేద్దామని అన్నాడట. అయితే నారాయణకు మాత్రం మహేష్ తో సినిమా చెయ్యాలని అదీ…. రాజమౌళి డైరెక్షన్ లో అని బాగా ఉందట. ఇక దీనికి మహేష్ కూడా సుముఖంగానే ఉండడంతో వచ్చే ఏడాది రాజమౌళి- మహేష్ కాంబినేషన్ లో ఒక చిత్రంఖచ్చితంగా వుంటుందనే సంకేతాలు అందుతున్నాయి.

More from my site

Comments

comments