మహేష్ బాబుకి భారీ టార్గెట్ ఫిక్స్ చేసిన ఎన్టీఆర్ – అభిమానుల చేతల్లో అంతిమ తీర్పు

టాలీ వుడ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – కే.ఎస్. రవీంద్ర ( బాబీ )ల క్రేజీ కాంబినేషన్ లో విడుదలైన “జై లవకుశ” ట్రైలర్ తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అభిమానులకు ‘ఐ ఫీస్ట్’గా మారిన ఈ ట్రైలర్ మొదటి రోజు 24 గంటలు గడిచే సమయానికి ఒక్క యూ ట్యూబ్ లోనే 5 మిలియన్స్ ను అందుకోగా, రియల్ టైంలో ఈ సంఖ్య ఏకంగా 7.54 మిలియన్స్ అని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంటే “బాహుబలి” తర్వాత అత్యధిక క్లిక్స్ అందుకున్న ట్రైలర్ రికార్డు నమోదు చేసి ‘స్పైడర్’కు టార్గెట్ ను ఫిక్స్ చేసింది. ఎన్టీఆర్ కి ఇదే పరిస్థితి టీజర్ విషయంలో నెలకొంది. ‘స్పైడర్’ టీజర్ తొలుత విడుదలై యూ ట్యూబ్ రికార్డును సృష్టించి, ‘జై లవకుశ’ కు టార్గెట్ ఫిక్స్ చేయగా, ‘జై’ పాత్రతో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టీజర్, ‘స్పైడర్’ టీజర్ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు.

తాజాగా ఇప్పుడు ధియేటిరికల్ ట్రైలర్ విషయానికి వస్తే ఇదే సీన్ రివర్స్ అయ్యింది. ‘జై లవకుశ’ ట్రైలర్ ముందుగా విడుదలై ‘నాన్ బాహుబలి’ రికార్డులను కొట్టి, ఈ నెల 15వ తేదీన విడుదల కానున్న ‘స్పైడర్’ టీజర్ కు భారీ టార్గెట్ ను విధించింది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “స్పైడర్”పై కూడా అంచనాలు బాగా ఉండడం, ఇటీవల చెన్నైలో జరిగిన వేడుక సక్సెస్ కావడంతో, ఈ ట్రైలర్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ శుక్రవారం నాడు హైదరాబాద్ లో ఈ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ జరగనున్న విషయం తెలిసిందే. ఎవరు గెలుస్తారో చూద్దాం.

More from my site

Comments

comments