జై లవకుశ ఫోటోలు మరియు టీజర్ లీక్.. నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు..!

స్టార్ సినిమా అంటే రిలీజ్ దాకా లీకుల బారిన పడకుండా కష్టపడాల్సి వస్తుంది. కొన్ని సినిమాలైతే రిలీజ్ కు ముందే సీన్స్ లీక్ అవుతుండటం చూస్తుంటాం. చిత్రయూనిట్ కు సంబందించిన వారే ఈ లీకులకు కారకులు అని తెలుస్తుంది. రీసెంట్ గా నిన్న ఉదయం నుండి జై లవకుశలో ఎన్.టి.ఆర్ ఫోటోలు మరియు టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఫోటోలు మరియు టీజర్ లీక్ అయిన విషయం వెంటనే గమనించిన చిత్రయూనిట్ సైబర్ క్రైం కు కంప్లైంట్ చేయడం ఆ నిందితుడిని పట్టుకోవడం జరిగింది. ఫోటోతో పాటు టీజర్ తాలూఖా విజువల్స్ కూడా లీక్ చేశాడు అతను. విచారణ చేపట్టిన పోలీసులు అనుమాతిడైన గణేష్ ను అరెస్ట్ చేశారు. ఇంకా దీని వెనకాల ఎవరి కుట్ర ఉందన్నది పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఎన్.టి.ఆర్ మూడు విభిన్న పాత్రలు చేస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

More from my site

Comments

comments