ఈ వారం విన్నర్: మరకతమణి సినిమా రివ్యూ..సస్పెన్స్ తో నవ్వులను పండించారు..

ఆది పినిశెట్టి, నిక్కి గర్లాని లీడ్ రోల్స్ లో నటించిన సినిమా మరకతమణి. కథ విషయానికొస్తే.. చిన్న చిన్న స్మగ్లింగ్ లు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న రఘునందన్ (ఆది పినిశెట్టి) అప్పులతో బాధపడుతుంటాడు. ఏదైనా పెద్ద ఢీల్ వస్తే ఎంత రిస్క్ అయినా చేసేద్దాం అనుకుంటున్న సమయంలో చైనా వ్యాపారి మరకతమణి గురించి చెబుతాడు. ఆ మణి తెచ్చిస్తే 10 కోట్ల రూపాయలు ఇస్తానని అంటాడు. అంతకుముందు మరకతమణి కోసం కొందరు వ్యక్తులు ప్రయత్నించగా వారు మరణిస్తారు. ఈ విషయం తెలిసినా సరే రఘునందన్ ఆ మణి కోసం ప్రయాణం మొదలుపెడతాడు. ఇక ఆ ప్రయాణంలోనే హీరోయిన్ పరిచయమవుతుంది. ఇంతకీ మరకతమణి విశిష్టత ఏంటి..? చైనా వ్యాపారి దాన్ని ఎందుకు పొందాలనుకున్నాడు..? రఘునందన్ మరకతమణిని సంపాదించాడా..? అన్నది అసలు కథ.

మరకతమణి సినిమాలో రఘునందన్ గా ఆది పినిశెట్టి అద్భుతమైన నటన కనబరిచాడు. సినిమా కామెడీగా నడిపిస్తూ త్రిల్లింగ్ అంశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు శరవణన్. ఇదవరకు సీరియస్ రోల్స్ లో నటించిన ఆది కామిక్ రోల్ లో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా నటించిన నిక్కి గర్లానికి మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది నిక్కి గర్లాని. సినిమాలో బ్రహ్మానంద కామెడీ చివర్ల్లో కాస్త రిఫ్రెష్ నెస్ ఇస్తుంది. కోటా శ్రీనివాస్ రావు నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆనంద్ రాజ్ కూడా బాగానే చేశాడు. మైం గోపి, రాందాస్ పాత్రలు బాగా పండాయి. సినిమాలో దర్శకుడు త్రిల్లింగ్ అంశాలను బలంగా రాసుకున్నా మొదటి భాగం ఎక్కువ పాత్రలను పరిచయం చేసేందుకే చాలా సమయం పట్టినట్టు అనిపిస్తుంది. కథ వరకు పాతదే అయినా కథనంలో దర్శకుడు చూపించిన ప్రతిభ మెచ్చుకోదగినది. ముఖ్యంగా సినిమాలో హైలెట్ గా అనిపించినవి ప్రీ క్లైమాక్స్ తో పాటుగా ఇంటర్వల్ కు ముందు వచ్చే సన్నివేశాలు. ఆడియెన్స్ ను పూర్తిగా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి. ఇక సినిమా ఎంత కామెడీ యాడ్ చేసినా ఎందుకో ఎంటర్టైన్మెంట్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. కథనం ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేది. పి.వి.శంకర్ కెమెరా పనితనం బాగుంది. థామస్ సంగీతం సినిమాకు మంచి మూడ్ క్రియేట్ చేస్తుంది. శరవణన్ కథనం మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే సినిమా ఇంకా అద్భుతంగా వచ్చి ఉండేది. మొత్తానికి తెలుగులో ఆది చేసిన ఈ ప్రయత్నం పర్వాలేదు అని చెప్పొచ్చు.

లాస్ట్ లైన్ : ‘మరకతమణి’ సస్పెన్స్ తో నవ్వులను పండించారు..!

Comments

comments