మారుతి, శర్వానంద్ ఇద్దరూ మహానుభావులే. మహానుభావుడు రివ్యూ& రేటింగ్

టైటిల్         : మహానుభావుడు
జానర్         : రొమాంటిక్ ఎంటర్ టైనర్
తారాగణం  : శర్వానంద్, మెహరీన్, వెన్నెల కిశోర్, నాజర్
సంగీతం     : తమన్
దర్శకత్వం : మారుతి
నిర్మాత      : వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్

ఇప్పటికే రెండుసార్లు పెద్ద హీరోల సినిమాలతో పోటీపడి విజయాల్ని అందుకున్న యంగ్ హీరో శర్వానంద్ ఈసారి ‘మహానుభావుడు’ చిత్రం ద్వారా ‘జై లవ కుశ, స్పైడర్’ వంటి భారీ సినిమాలకు పోటీగా దసరా బరిలోకి దిగాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కథలోకి వెళ్తే భలే భలే మగాడివోయ్ సినిమాలో లాగే ఒక లోపం ఉన్న హీరో. ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. తన లోపం కారణంగా ఆ ప్రేమ ఫెయిలయ్యే పరిస్థితి వస్తుంది. మిగతా అన్ని విషయాల్లోనూ ఆ లోపం కారణంగా ఇబ్బంది పడే హీరో తాను ప్రేమించిన అమ్మాయి విషయం దగ్గరకు వచ్చేసరికి తన లోపాన్ని జయించి మరీ ఆ అమ్మాయి ప్రేమను, వాళ్ళ నాన్న ప్రేమను ఎలా గెల్చుకున్నాడన్నదే కథ.

కథ :

ఓసిడి (అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్) అనగా అతి శుభ్రత.. ఈ లక్షణంతో ఉండే కుర్రాడు ఆనంద్ (శర్వానంద్) తనతో పాటు తన చుట్టూ ఉండే పరిసరాలు, వస్తువులు, వ్యక్తులు కూడా శుభ్రంగా ఉండాలని అనుకుంటాడు. అలా కాకుండా ఎవరైనా చిన్న అశుభ్రతతో కనిపించినా ఓవర్ గా రియాక్టవుతుంటాడు. ఎవరైనా చూయింగ్ గమ్ నమిలి రోడ్డు మీద ఊసినా వాళ్ళకి పెద్ద క్లాస్ పీకుతాడు, జబ్బుతో ఉంటే కనీసం కన్నతల్లిని కూడా దగ్గరకు రానివ్వనంతటి శుభ్రత అతనిది.

అలాంటి లక్షణం కలిగిన ఆనంద్ తన కొలీగ్ మేఘనను ప్రేమిస్తాడు. మేఘన కూడా అతన్ని ఇష్టపడి ఆరంభంలో అతని ఓసిడి లక్షణాల్ని పెద్దగా పట్టించుకోకపోయినా తర్వాత తర్వాత కొన్ని సందర్భాల వలన తట్టుకోలేక బ్రేకప్ చెబుతుంది. అలా ఓసిడి వలన ప్రేమను కోల్పోయిన ఆనంద్ తిరిగి ప్రేమను ఎలా దక్కించుకున్నాడు, ఓసిడికి, ప్రేమకి మధ్యన ఎలా నలిగిపోయాడు, చివరికి అతని జీవితం ఏమైంది అనేదే ఈ ‘మహానుభావుడు’ కథ..

ఈ సినిమాతో వచ్చే మొదటి ఇబ్బంది ఒక్కటే. లాజిక్కులు అస్సలు వెతక్కుండా చూడాల్సి రావడం. హీరోకి ఉన్న డిజార్డర్‌ని తనకు కంఫర్టబుల్‌గా అనిపించిన స్థాయిలో లాజిక్కులు పట్టించుకోకుండా కామెడీ పుట్టించడం కోసమే వాడేశాడు మారుతి. లాజిక్కులు వెతకడం ఆపేస్తే సినిమాని పూర్తిగా ఎంజాయ్ చెయ్యొచ్చు. అలాగే కథనంలో ట్విస్ట్‌లు కూడా ఏమీ ఉండవు. కథనం కొన్ని సార్లు మరీ బాగా లేనట్టుగా కూడా అనిపిస్తుంది. అయితే అన్ని లోపాలనూ కూడా కామెడీ కవర్ చేసేసింది. హిలేరియస్ ఫన్ వర్కవుట్ అవ్వడంతో లోపాలన్నీ వెనక్కి వెళ్ళి కామెడీ మాత్రం ఫోర్ ఫ్రంట్‌లో ఉంటుంది. పండగపూట కాసేపు రిలాక్స్ అవ్వడం కోసం, నవ్వుకోవడం కోసం సినిమా చూడాలనుకునే వాళ్ళందరికీ మహానుభావుడు బెస్ట్ ఛాయిస్. ముఖ్యంగా రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోకి ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ కూడా మహానుభావుడే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాడనడంలో సందేహం లేదు. రాధ సినిమాతో శర్వా, బాబు బంగారంతో మారుతిలు ఫెయిల్యూర్స్ ఎదుర్కున్నప్పటికీ ఈ సినిమాతో మాత్రం ఇద్దరూ కూడా సూపర్ హిట్ కొట్టేయడం ఖాయం. అలాగే కలెక్షన్స్ కూడా భలే భలే మగాడివోయ్‌కి ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఉంటాయనడంలో సందేహం లేదు.

ప్లస్ పాయింట్స్ :
శర్వానంద్ నటన
కామెడీ

మైనస్ పాయింట్స్ :
కొత్తదనం లేకపోవటం

 రేటింగ్: 3/5

                              భలే భలే మహానుభావుడు

 

 

Comments

comments