“మేడ మీద అబ్బాయి” ట్వీట్ రివ్యూ

12:35 PM : సందేశాత్మక సన్నివేశంతో చిత్రం ముగిసింది. పూర్తి రివ్యూ కోసం వేచి ఉండండి

12:30 PM : చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది. చిత్రంలో ఆసక్తికరమైన ట్విస్ట్ వచ్చింది

12:20 PM : చిత్రంలో ట్విస్ట్ రివీల్ అయింది. కొన్ని సీరియస్ సన్నివేశాలు వస్తున్నాయి.

12:15 PM : ఆ వ్యక్తి కోసం వారి వెతుకులాట ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ‘ఒంటరి మనసా’ అనే సాంగ్ వస్తోంది.

12:05 PM : ఓ వ్యక్తి గురించి తెలుసుకునేందుకు అల్లరి నరేష్, అవసరాల శ్రీనివాస్, నిఖిల మరియు హైపర్ ఆది లు ప్రయత్నాలు చేస్తున్నారు.

11:55 AM : హీరోయిన్ అసలు ఉద్దేశం ఏంటో బయటపడింది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొనసాగుతున్నాయి.

11:45 AM : మిస్టరీగా ఉన్న ఓ విషయం గురించి ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. బ్యాక్ గ్రౌండ్ లో ‘కాలం ఆగిపోదు’ సాంగ్ వస్తోంది.

11:40 AM : అవసరాల శ్రీనివాస్ ప్రైవేట్ డిటెక్టివ్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.

11:30 AM : ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. అల్లరి నరేష్, హైపర్ ఆది మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.

11:15 AM : ఇంటర్వెల్ ఎపిసోడ్ ముగిసింది. ఇప్పుడు బ్రేక్.

11:10 AM : చిత్రం ఇంటర్వల్ దిశగా సాగుతోంది. ఓ తప్పిదం వలన గ్రామం మొత్తం కన్ఫ్యూషన్ నెలకొని ఉంది.

11:05 AM : కథ ఇప్పుడు హైదరాబాద్ కు మారింది. అల్లరి నరేష్ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ప్రస్తుతం ‘హైదరాబాద్ నగరం’ సాంగ్ వస్తోంది.

10:55 AM : ప్రస్తుతం కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.

10:50 AM : హీరోయిన్ నిఖిల విమల్ సింపుల్ ఎంట్రీ ఇచ్చింది. అల్లరి నరేష్ తొలి చూపులోనే ఆమె ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం ‘ఏకాంతమా ఏకాంతమే’ అనే మెలోడీ సాంగ్ వస్తోంది.

10:45 AM : అల్లరి నరేష్, శివ రెడ్డి మధ్య కామెడీ సీన్స్ వస్తున్నాయి.

10:37 AM : సత్యం రాజేష్ కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. కామెడీ చాలా బాగా పండుతోంది.

10:35 AM : జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది హీరో ఫ్రెండ్ గా ఎంట్రీ ఇచ్చాడు.

10:33 AM : చిత్రం గ్రామానికి మారింది. కొన్ని ఫన్నీ ఫ్యామిలీ సీన్స్ వస్తున్నాయి.

10:28 AM : ప్రస్తుతం ‘నోట్లోన వేలు పెడితే’ అనే ఫస్ట్ సాంగ్ వస్తోంది. అల్లరి నరేష్ పాత్ర ఎలా ఉంటుందో ఈ సాంగ్ లో చూపిస్తున్నారు.

10:25 AM : బి.టెక్ స్టూడెంట్ గా అల్లరి నరేష్ సింపుల్ ఎంట్రీ ఇచ్చారు. కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.

10:23 AM : ఓ బాయ్స్ హాస్టల్ లో చిత్రం ప్రారంభమైంది. బ్యాచులర్లకు సంబందించిన సీన్స్ వస్తున్నాయి.

10:20 AM : హాయ్.. చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.

More from my site

Comments

comments