మెగా డాటర్ నిహారిక ట్రైలర్ విడుదల

సక్సెస్‌ఫుల్‌ వెబ్‌ సీరీస్‌ ముద్దపప్పు ఆవకాయతో నటిగా పరిచయం అయిన మెగా డాటర్‌ నిహారిక, తరువాత యాంకర్‌, హీరోయిన్‌గా ప్రూవ్‌ చేసుకుంది. అయితే డిజిటల్‌ మీడియాలో ఘనవిజయం సాదించిన, నిహారిక వెండితెర మీద మాత్రం సక్సెస్‌ సాదించలేకపోయింది. దీంతో మరోసారి వెబ్‌ సీరీస్‌ లో అలరించేందుకు రెడీ అవుతోంది. తండ్రి నాగబాబుతో కలిసి ‘నాన్న కూచి’ అనే ఫీచర్​ ఫిలిం చేస్తోంది నిహారిక.

ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ ఫిలిం టీజర్‌ను రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ స్వయంగా తన సోషల్‌ మీడియా ద్వారా ఎనౌన్స్‌ చేశారు. ఈ ఫిలింలో నాగబాబు, నిహారికలు తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు.

More from my site

Comments

comments