ఈ తరానికి మహేషే సూపర్ స్టార్ అంటున్న మెగాహీరో!

‘1 నుంచి 10 వరకూ మెగాస్టార్‌ చిరంజీవి మాత్రమే.. ఆ తర్వాతే మా నెంబరింగ్‌ స్టార్ట్‌ అవుతుంది..’ 

– చాన్నాళ్ళ క్రితం టాలీవుడ్‌లో చిరంజీవి తర్వాత నెంబర్‌ వన్‌ పొజిషన్‌ ఎవరిది.? అన్న ప్రశ్నకు మహేష్‌ ఇచ్చిన సమాధానమిది. 

మెగాస్టార్‌ చిరంజీవి మీద మహేష్‌కి వున్న అభిమానం అలాంటిది. అయినాసరే, పోటీ పోటీనే. మెగా ఫ్యాన్స్‌కీ మహేష్‌ ఫ్యాన్స్‌కీ మధ్యన సోషల్‌ మీడియా వేదికగా రచ్చ అప్పుడప్పుడూ జరుగుతూనే వుంటోంది. చరణ్‌, మహేష్‌ మంచి స్నేహితులు. పవన్‌ – మహేష్‌ సంగతి సరే సరి. అయినా, అభిమానుల రచ్చ మాత్రం ఆగదాయె.

ఆ సంగతి పక్కన పెడితే, తాజాగా మెగా హీరో ఒకరు, మహేష్‌ని ‘మన తరానికి నువ్వే సూపర్‌ స్టార్‌’ అంటూ అభివర్ణించాడు. ఆ మెగా హీరో ఎవరో కాదు, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌. మహేష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, సోషల్‌ మీడియాలో సాయిధరమ్‌ తేజ్‌ చేసిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యింది.

ఒకప్పుడు సూపర్‌ స్టార్‌ అంటే కృష్ణ. ఆయన తనయుడిగా, నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మహేష్‌, టాలీవుడ్‌లో నయా సూపర్‌ స్టార్‌గా అవతరించాడు. సినిమా సినిమాకీ రేంజ్‌ పెంచుకుంటూ పోతోన్న మహేష్‌ని, పలువురు సినీ ప్రముఖులు అభినందించారు. అందరిలోకీ సాయిధరమ్‌తేజ అభినందన వెరీ వెరీ స్పెషల్‌.

టాలీవుడ్‌లో ఆరోగ్యకరమైన వాతావరణానికి ఇదొక పెర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ అనుకోవచ్చు. మహేష్‌తోనే కాదు, టాలీవుడ్‌లో చాలామంది హీరోలతో సాయిధరమ్‌తేజకి మంచి ‘స్నేహం’ వుంది. మొన్నామధ్య ఎన్టీఆర్‌, సాయిధరమ్‌తేజ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చాడు. ఆ సందర్భంలో ఎన్టీఆర్‌, తేజు మధ్య సరదా సరదా వాతావరణం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఒకే రోజు రెండు మూడు సినిమాలు రిలీజ్‌ అవుతున్నా, ఒకర్ని ఒకరు అభినందించుకోవడం ఈ తరం హీరోల ప్రత్యేకత అని చెప్పుకోవాలేమో. అది తెలుగు సినిమాకి అవసరం కూడా.! ఎందుకంటే, తెలుగు సినిమాని ఇప్పుడు దేశమంతా ప్రత్యేకంగా చూస్తోంది. సినిమా సినిమాకీ మార్కెట్‌ పెంచుకుంటోన్న టాలీవుడ్‌లో ఇంతటి స్నేహపూర్వక వాతావరణానికి హేట్సాఫ్‌ చెప్పాల్సిందే.

More from my site

Comments

comments