రేపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా విడుదల

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మొదటి చిత్రం ‘చిరుత’. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సీనియర్ నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2007 లో విడుదలైన ఈ సినిమా చరణ్ కి చక్కటి లాంచింగ్ అయ్యింది.

ప్రస్తుతం ఈ చిత్రాన్ని తమిళంలో ‘చిరుతై వేటై’ అనే టైటిల్ తో డబ్ చేస్తున్నారు. రేపు తమిళనాడులో ఈ సినిమా విడుదలవుతోంది. దాంతో కోలీవుడ్ లోని రామ్ చరణ్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. టిఎఫ్ పిసి ప్రొటెస్ట్ కొనసాగుతున్న నేపధ్యంలో ఈ వారం తమిళనాడులో పెద్ద సినిమాలు విడుదలవ్వడంలేదు. ఇది రామ్ చరణ్ ‘చిరుతై వేటై’ కి కలిసొస్తుందని ఈ సినిమాని విడుదల చేస్తున్న పికె స్టూడియో బ్యానర్ భావిస్తోంది. తమిళనాడులోని రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా సినిమాకి మంచి రన్ ఉంటుందని, తమిళ ఆడియన్స్ ఈ సినిమాని ఆదరిస్తారని అంటున్నారు. సో.. రేపు విడుదలవుతున్న తమిళ వెర్షన్ ‘చిరుతై వేటై’ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో వేచి చూద్దాం. రామ్ చరణ్ సరసన నేహా శర్మ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది.

More from my site

Comments

comments