97 ఏళ్ల వయసులో గుజరాతీ నృత్యం చేస్తున్న మోదీ మాతృమూర్తి : కిరణ్ బేడీ (వీడియో)

దీపావళి స్ఫూర్తిని వెల్లడించేందుకు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడి తన ట్విట్టర్ పేజీలో ఒక వీడియోను షేర్‌ చేశారు. గుజరాతీ జానపద బాణికి లయబద్ధంగా ఓ వృద్ధ మహిళ నృత్యం చేస్తున్న ఈ వీడియో చూడగానే ఎవ్వరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ వృద్ధురాలు మరెవరో కాదు, ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ అని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘97 ఏళ్ల వయసులోనూ దీపావళి స్ఫూర్తిని నింపుకుని తన సొంత గృహంలో దివాళి వేడుక చేసుకుంటున్న ఈమె ఎవరో కాదు ప్రధాని మోదీ మాతృమూర్తి’ అని కిరణ్‌ బేడి ట్వీట్‌ చేశారు.
‘వీడియోలో ఉన్న వృద్ధురాలిని గుర్తించడంలో పొరపాటు జరిగింది. కానీ అమ్మ ఉత్సాహానికి సెల్యూట్‌ చేస్తున్నాను. నేను కనుక 96 ఏళ్లు బతికితే ఆవిడలా ఉండాలని కోరుకుంటాన’ని మరో ట్వీట్‌ చేశారు.

More from my site

Comments

comments