నందమూరి అభిమానులకు మోక్షజ్ఙ సూపర్ షాక్?

mokshagna

మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు క్రికెట్ టీం అంతమంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇక మిగతా ఫ్యామిలీల నుంచి కూడా బాగానే వచ్చారు. అఫ్కోర్స్ నందమూరి నుంచి కూడా వచ్చిన హీరోల సంఖ్య భారీగానే ఉందనుకోండి. ఇక ఇప్పుడు నందమూరి అభిమానులందరూ కూడా నట సింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఙ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. బాలయ్య సినిమా ఫంక్షన్స్ ఎప్పుడు, ఎక్కడ జరిగినా కూడా మోక్షజ్ఙ ఎంట్రీ ఎప్పుడు అన్న ప్రశ్న ఎదురవుతోంది? బాలకృష్ణ కూడా రకరకాల సమాధానాలు చెప్తూ ఉన్నాడు. ఇంకా టైం ఉందని ఒకసారి, అలాగే ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నామని ఇంకో సారి….అలాగే టైం వచ్చినప్పుడు అదే జరిగిపోతుంది…అంతా దైవేచ్ఛ అని ఒకసారి చెప్తూ ఉన్నాడు. మరోవైపు బాలయ్య అత్యంత ఆత్మీయుడు అయిన నిర్మాత సాయి కొర్రపాటిగారేమో మోక్షజ్ఙ సినిమా నా నిర్మాణంలోనే ఉంటుందని మీడియాకు చెప్పేశాడు. ఇక డైరెక్టర్స్ పేర్లు అయితే ఎన్నో వినిపించాయి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి నుంచి బోయపాటి శ్రీను, క్రిష్, సింగీతం శ్రీనివాసరావు…ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది.

మోక్షజ్ఙ అరంగేట్ర సినిమా చుట్టూ ఇంత ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఒక్క అడుగుకూడా పడలేదు. ఆల్రెడీ ట్వంటీస్ దాటేసిన మోక్షజ్ఙకు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి అవసరమైన ఏజ్ అయితే వచ్చేసినట్టే. అయినా ఎందుకు ఆలస్యం? అసలు మోక్షజ్ఙ సినిమా ఎంట్రీ విషయంలో తెరవెనుక ఏం జరుగుతోంది అని చెప్పి నిన్నటి వరకూ ఫిల్మ్ నగర్ జనాలు చాలా క్యూరియాసిటీనే చూపించారు. ఇప్పుడు మోక్షజ్ఙకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అసలు మోక్షజ్ఙకు సినిమాలంటేనే ఇష్టం లేదట. మోక్షజ్ఙ ఇంట్రెస్ట్ అంతా కూడా దేశంలోనే పేరు తెచ్చుకునేలా బిజినెస్ మేన్ అవ్వాలనుందట. అందుకే తన ఆసక్తికి తగ్గట్టుగా ఉన్న బిజినెస్‌లను స్టడీ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే నందమూరి కుటుంబ సభ్యులెవ్వరూ కూడా మోక్షజ్ఙ నిర్ణయాన్ని సమర్థించడం లేదని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఙ కూడా సినిమా హీరోనే అవ్వాలనేది వాళ్ళ ఆశ. ఇప్పటి వరకూ ఈ విషయంలో బాలకృష్ణ మాత్రం సీరియస్‌గా జోక్యం చేసుకోలేదట. ఒక సారి బాలకృష్ణ సీన్‌లోకి ఎంటర్ అయ్యి సీరియస్‌గా చెప్తే మాత్రం మోక్షజ్ఙ వెంటనే తలూపేస్తాడని చెప్తున్నారు. బాలయ్య అంటే మోక్షజ్ఙకు గౌరవంతో పాటు భయభక్తులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. అయినా మోక్షజ్ఙ కెరీర్ అనేది నందమూరి కుటుంబానికి సంబంధించిన విషయం ఒక్కటే కాదుగా. బిజినెస్ అని చెప్పి సినిమాలు చెయ్యను అని మోక్షజ్ఙ చెప్తే ఇంకేమైనా ఉందా? నందమూరి అభిమానులందరూ కూడా ఉద్యమమైనా చేసెయ్యరు. అలా అభిమానుల హంగామా మొదలైందంటే మాత్రం అప్పుడు బాలయ్య కూడా ఏమీ చెయ్యలేడు. మోక్షజ్ఙ సినిమాకు ప్రారంభోత్సవం చెయ్యడం తప్ప. ఏమంటారు?

Related News

Comments

comments