“జై లవకుశ” థియేటర్ల దగ్గర సందడి చేయనున్న నాగార్జున

ప్రస్తుతం నాగార్జున ఓంకార్ దర్శకత్వంలో రాజు గారి గది 2 అనే సినిమాలో నటిస్తూ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో సమంత – సీరత్ కపూర్ కథానాయికలు కాగా వెన్నల కిషోర్ మరో పాత్రలో అలరించనున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా పూర్తయ్యిందట కాకపోతే సినిమాలో కొన్ని సీన్స్ నాగార్జున కి నచ్చకపోవడంతో రీ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ముందుగా అనుకున్న దాని ప్రకారం అక్కినేని నాగేశ్వర రావు పుట్టిన రోజు సందర్బంగా సెప్టెంబర్ 20 న ట్రైలర్ ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఈ రోజు ట్రైలర్ వచ్చినా కూడా.. ధియేటర్లలో మాత్రం రేపటి నుండి కనిపిస్తుంది.

అవును.. తాజా సమాచారం ప్రకారం ట్రైలర్ ని “జై లవకుశ” థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారట. ప్రతి షోకి ముందు రాజుగారి గది 2 ట్రైలర్ కూడా ప్రేక్షకులకు చూపించేవిధంగా నాగ్ – “జై లవకుశ” నిర్మాతతో మాట్లాడుకున్నాడట. “జై లవకుశ” 21న అనగా రేపే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించిన జై లవకుశ సినిమాకు బాబీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం జై లవకుశ థియేటర్స్ లో నాగార్జున రాజు గారి గది 2 ట్రైలర్ సందడి చేస్తుందన్నమాట.

More from my site

Comments

comments