నందమూరి నటసింహం బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ కు ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే. (ట్రైలర్ )

వన్ లైన్ పంచ్ లను అద్భుతంగా రాయగల పూరీ జగన్నాధ్ పెన్ను మరోసారి అదిరిపోయే డైలాగ్స్ ను “పైసా వసూల్” ద్వారా ప్రేక్షకులకు అందించబోతుందని ధియేటిరికల్ ట్రైలర్ స్పష్టం చేసింది. నందమూరి నటసింహం బాలకృష్ణ చెప్పిన DIALOGUES కి అభిమానుల మతి పోవాల్సిందే అనిపించే విధంగా స్పందన వస్తోంది.

‘మేరా నామ్ తేడా… తేడాసింగ్… దిమాగ్ తోడా… చాలా తేడా…’ ‘దిస్ ఈజ్ మై విజిబుల్ రికార్డింగ్ వికీపీడియా’ ‘గొడవల్లో గోల్డ్ మెడల్ వచ్చినోడ్ని… మళ్ళీ టోర్నమెంట్లు పెట్టొద్దు…’ ‘ఒన్స్ నా స్క్రూ లూజ్ అయితే… నేను ఇలాగే ఉంటా…’ ‘బీహార్ నీళ్ళు తాగినోళ్లనే తీహార్ లో పోయించా… తూ క్యారె హోలే…’ ‘నేనంతే… కసి తీరకపోతే… శవాన్ని లేపి మరీ చంపేస్తా.

ఇలా బాలయ్య పలికిన డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొన్నారు. ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

 

More from my site

Comments

comments