నానీ-హను సినిమా టైటిల్….కొత్తదనానికే అమ్మా అనిపించేలా ఉందిగా

nani

సహజ నటుడు, సంవత్సరానికి నాలుగు సినిమాలు రిలీజ్ చేసే సత్తా ఉన్న ఒకే ఒక్క స్టార్ హీరో, సినిమా సినిమాకూ మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్న హీరో…..అలాగే సినిమా సినిమాకూ ఫ్యాన్స్ సంఖ్యను పెంచుకుంటూ వెళ్తున్న ఒకే ఒక్క హీరో……నానీ గురించి ఇలాంటివి ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ప్రొడ్యూసర్స్‌కి, డైరెక్టర్స్‌కి డార్లింగ్ లాంటి వాడు నానీ. టాప్ డైరెక్టర్ రాజమౌళితో సహా చాలా మంది హీరోలు, హీరోయిన్స్ కూడా నానీతో టైం స్పెండ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక సినిమాల విషయంలో కూడా చాలా చాలా వెరైటీ చూపిస్తున్నాడు నానీ. లాస్ట్ ఇయర్ హను రాఘవపూడితో కలిసి కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో హిట్ కొట్టిన నానీ ఇప్పుడు మరోసారి అదే డైరెక్టర్‌తో జత కడుతున్నాడు.

ప్రస్తుతం నానీ కమిట్ అయి ఉన్న సినిమాలతో పాటు….నితిన్‌తో హను రాఘవపూడి చేస్తున్న సినిమా కంప్లీట్ అవ్వగానే వీళ్ళిద్దరి సినిమా పట్టాలపైకి ఎక్కుతుంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ లాక్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కోసం అనుకుంటున్న టైటిల్ బయటకు వచ్చింది. ఇండస్ట్రీలో జనాలతో పాటు, ప్రేక్షకులను కూడా మెప్పించే స్థాయిలో ఆ టైటిల్ ఉంది. అలాగే వెరైటీకే బొమ్మ చూపించే స్థాయి వెరైటీ కూడా ఆ టిటిల్‌లో ఉంది. ‘అదివో అల్లదివో శ్రీహరి వాసమూ…’ అన్నదే ఆ టైటిల్. పోలా……అదిరిపోలా…….తిరుపతి బ్యాక్ డ్రాప్‌లో జరిగే లవ్‌స్టోరీకి ఈ టైటిలే కరెక్ట్ అని హీరో, డైరెక్టర్‌లు అనుకుంటున్నారట. మరి ఈ లవ్ స్టోరీకి ఆ తిరుమల వాసుడికి కూడా ఏదో లింక్ ఉన్నట్టుగానే కనిపిస్తోంది. మొత్తానికి టైటిల్‌తోనే సూపర్ బజ్ క్రియేట్ అయ్యే స్థాయిలో సూపర్ టైటిల్ పట్టేశారు నానీ, హను రాఘవపూడిలు. ఇక సినిమాతో ఏ రేంజ్ సంచలనం క్రియేట్ చేస్తారో చూడాలి.

Related News

Comments

comments