స్టార్ హీరోలకు నాని ఏం తక్కువ..!

ఓ హీరో స్టామినా అతని సినిమా కలెక్ట్ చేసే వసూళ్లని బట్టి ఉంటుంది. ఇక వరుసగా హిట్లు కొడుతూ విక్టరీ తన ఇంటి పేరు చేసుకున్న నాచురల్ స్టార్ నాని సినిమా కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇక ఒక్క సినిమా హిట్ అయితేనే ఊగిపోయే హీరోలున్న ఈ టైంలో వరుసగా 7 సూపర్ హిట్లు అందుకున్న నాని తన రేంజ్ పెంచుకున్నాడు.

నిన్న మొన్నటిదాకా కోటి రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న నాని మజ్ను తర్వాత నేను లోకల్ కు 3-4 కోట్ల దాకా తీసుకున్నాడని టాక్. ఇక నేను లోకల్ కెరియర్ బ్లాక్ బస్టర్ అవడంతో రెమ్యునరేషన్ 5 కోట్లు ఫిక్స్ చేశాడట. అలానే రిలీజ్ అయిన నిన్ను కోరి చేస్తున్న మరో రెండు సినిమాలు ఇదే రెమ్యునరేషన్ తో చేస్తున్నాడట. ఇక రీసెంట్ రిలీజ్ నిన్ను కోరి కూడా మంచి కలక్షన్స్ తో దూసుకుపోతుండటంతో నాని మరోసారి తన రెమ్యునరేషన్ పెంచాలని అనుకుంటున్నాడట.

ప్రస్తుతం 5 కోట్లున్న తన పారితోషికం మరో 3 యాడ్ చేసి ఏకంగా 8 కోట్లు ఇస్తేనే సినిమా అంటున్నాడట. నాని సినిమా 10 కోట్ల బడ్జెట్ 20 కోట్ల బిజినెస్ 25 టూ 30 కోట్ల కలక్షన్స్ ఇది లెక్కగా సాగుతుండటంతో నాని అడిగిన 8 కోట్లు కూడా ఇచ్చేందుకు సై అంటున్నారట నిర్మాతలు. కాంపిటేటివ్ ప్రపంచం కాబట్టి క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకునే ఆలోచనతో నాని కోట్లకు పడగెత్తుతున్నాడు. ఈ లెక్కన చూస్తే నాచురల్ స్టార్ కూడా స్టార్ హీరోలకు తక్కువ ఏమి కాదని చెప్పొచ్చు.

More from my site

Comments

comments