నారా హీరో…..ఇంకో మంచి సినిమా ఖాయం అనే స్థాయిలో టీజర్

తెలుగు సినిమా హీరోలకు ఉండాల్సిన రెగ్యులర్ లుక్స్, డ్యాన్సుల విషయంలో నారా రోహిత్‌కి చాలా మైనస్‌లే ఉన్నాయి. అయితే చాలా మంది హీరోలకు లేని జడ్జ్‌మెంట్ మాత్రం నారా రోహిత్ సొంతం. అలాగే కనీసం ఓ ఇద్దరు ముగ్గురు హీరోలకు కూడా లేనంత గొప్ప వాయిస్ రోహిత్ సొంతం. ఆ వాయిస్వ‌తోనే సగం యాక్టింగ్ చేసేయడం రోహిత్ స్పెషాలిటి. ఇక తనకంటూ ఓ ప్రత్యేక పంథా…..తన సినిమాలన్నీ ప్రత్యేకంగా ఉండేలా కొత్త కథను ఎంచుకోవడంలో కూడా రోహిత్ తెలివితేటలను క్రిటిక్స్ కూడా ప్రశంశిస్తూ ఉంటారు.

ఇప్పుడు కూడా మరోసారి ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని టీజర్‌తోనే నిరూపించాడు నారా హీరో. కథలో రాజకుమారి అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో జ్యో అచ్చుతానంద సినిమాతో సూపర్ హిట్ కొట్టిన తన కో హీరో నాగశౌర్యతో…….ప్రేమకథా చిత్రం హీరోయిన్ నందిత హీరోయిన్‌గా ఈ కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నాడు రోహిత్. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ అందరినీ మెప్పిస్తోంది. టీజర్‌లో ఉన్న డైలాగ్స్ అయితే అదిరిపోయాయి. అలాగే మంచి కథ, మంచి సినిమా అన్న భావనను టీజర్‌తోనే కలిగించాడు డైరెక్టర్. టీజర్‌లో చూపించిన ప్రతి విషయం కూడా బాగుంది. డైలాగ్స్, మ్యూజిక్, నారా రోహిత్, నాగశౌర్య, నందితల పెర్ఫార్మెన్స్……ఇలా అన్నీ బాగున్నాయి. జ్యో అచ్యుతానందతో హిట్ కొట్టిన రోహిత్…..ఇప్పుడు కథలో రాజకుమారి లాంటి మరో పొయెటిక్ టైటిల్‌తో మరో హిట్ కొట్టేస్తాడేమో చూడాలి మరి.

Comments

comments