కలెక్షన్ల వర్షం కురిపిస్తున్ననేనే రాజు నేనే మంత్రి

తేజ దర్శకత్వంలో రానా హీరోగా నటించిన నేనేరాజు నేనే మంత్రి ఆగస్టు 11న రిలీజ్ అయిన విషయం తెలిసిందే . మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడంతో కొంత ఇబ్బంది పడినప్పటికీ ఆ మూడు చిత్రాల్లో నెంబర్ వన్ గా ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకొని సక్సెస్ బాటలో పయనిస్తోంది నేనేరాజు నేనే మంత్రి చిత్రం . మొత్తం పది రోజుల్లోనే 22 కోట్ల షేర్ ని ప్రపంచ వ్యాప్తంగా సాధించి భారీ విజయం దిశగా పయనిస్తోంది.

కేవలం 15 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే 22 కోట్ల షేర్ ని వసూలు చేయగా అవలీలగా మరో 8 నుండి పది కోట్లు షేర్ రాబట్టడం ఖాయమని అంటున్నారు . ఇది కాక శాటిలైట్ , డిజిటల్ రైట్స్ ఇతరత్రా కలుపుకొని 40 కోట్ల పై చిలుకు సినిమా కావడం ఖాయం . అంటే రెండింతల లాభం తెచ్చిపెడుతోంది ఈ సినిమా . భారీ బడ్జెట్ అంటూ 40 కోట్లు 50 కోట్లకు పైగా ఖర్చు పెడుతూ ఆ స్థాయి వసూళ్లు లేదంటే అంతకు మించి మాత్రమే సాధిస్తున్న వాళ్ళు మా సినిమా బ్లాక్ బస్టర్ అంటే మా సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ఊదర గొడుతున్న ఈ సమయంలో అసలు సిసలైన బ్లాక్ బస్టర్ ఈ నేనేరాజు నేనే మంత్రి అని చెప్పక తప్పదు .

ఇక రానా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ బోయపాటి సినిమాకంటే కూడా మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ముందుగా మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా 11వ రోజు 2. 01 లక్షల షేర్ ను రాబట్టి మొత్తంగా 1.37 కోట్లు రాబట్టుకుని మంచి లాభాల్ని చూపిస్తోంది.

More from my site

Comments

comments