“నెపోలియన్” టీజర్ రివ్యూ – దమ్మున్న ట్రైలర్

సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఒక గోల నడుస్తూ ఉంటుంది.వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది,”చిన్న సినిమాని బ్రతకనివ్వడం లేదు” అని.కాని వాస్తవమేంటంటే,అందరూ మాట్లాడే ఆ చిన్న సినిమానే ప్రేక్షకులను బ్రతకనివ్వడం లేదు అనేది ఎక్కువమంది కంప్లైంట్.ప్రతి శుక్రవారం సుమారు అయిదు సినిమాలు విడుదలవుతున్నాయి ఒక్క తెలుగులోనే.అందులో ఒకటి లేదా రెండు ప్రక్కన పెడితే మిగిలినవి చిన్న సినిమాలే.కాని ఆ సినిమాలు చెత్తగా ఉంటాయని ధియేటర్ కి వెళ్ళకుండానే ఎవరైనా చెప్పెయ్యొచ్చు.ఎందుకంటే అప్పటికే విడుదలైన సినిమా స్టిల్స్ & ట్రైలర్స్ లోనే సినిమా దమ్మెంత ఉందో చాలావరకు తేలిపోతుంది.

“పెళ్ళిచూపులు” వంటి సినిమా హిట్ కావడానికి ఆ సినిమా ట్రైలర్ ఎంతో ఉపయోగపడిందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆ రెండు నిమిషాల ట్రైలర్లోనే ప్రేక్షకులను ఆకట్టుకోలేని దర్శకుడు రెండున్నర గంటల సినిమాలో ఏదో ఉద్ధరిస్తాడనుకోవడం భ్రమ.అందుకే ట్రైలర్లో ఆకట్టుకోలేని సినిమాలు,హిట్ కాకపోవడానికి 95% ఛాన్స్ ఉంటుంది.అలాగే ట్రైలర్లో ఆకట్టుకున్న సినిమాలు హిట్ కావడానికి కూడా 95% ఛాన్సుంటుంది.ఇప్పుడు ఈ సోది అంతా దేనికంటే,ఈరోజు “నెపోలియన్” అనే కొత్త సినిమా ట్రైలర్ విడుదలయ్యింది.రెండు నిమిషాల ఆ ట్రైలర్ చూసిన ఎవరికైనా,ఆ సినిమాలో ఏదో విషయం ఉంది అనే విషయం ఈజీగా అర్ధమవుతుంది.సంవత్సరానికి తెలుగులో విడుదలవున్న సుమారు 250 సినిమాలలో 150 సినిమాలు చిన్న సినిమాలే.వాటిలో విడుదలకు ముందే ప్రేక్షకులలో కనీస ఆసక్తిని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యేవి ఒకటో రెండో.ఈ సినిమా ఖచ్ఛితంగా ఆ రెండింటిలో ఒకటి.ఈ “నెపోలియన్” ట్రైలర్ లో ఉన్న విషయాన్ని మీకు వివరించడంలేదు.అది బాగుందని మాత్రమే నా అభిప్రాయం చెబుతున్నాను.మీరుకూడా చూసి నా అభిప్రాయం తప్పో ఒప్పో చెప్పండి.

More from my site

Comments

comments