సరి కొత్త వాట్సాప్ …

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ను వాడేవారి సంఖ్య 100 కోట్లు దాటిపోయింది. వాట్సాప్ ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ ను వినియోగదారులకి అందించబోతోంది. వాట్సాప్ ఉపయోగంలోకి వచ్చాక సందేశాలతో పాటు ఫోటోలు – వీడియోలు పంపడం సెకన్లలో పనిగా మారిపోయింది. అయితే వాట్సాప్ లో ఇప్పటివరకు లేని ఓ సరికొత్త ఆప్షన్ అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతం మనం వాట్సాప్ ద్వారా పంపిన సందేశాన్ని తిరిగి రద్దుచేసుకోవడం తిరిగి వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. కానీ రానున్న కొద్దిరోజుల్లో వాట్సాప్ లో పంపిన సందేశాన్ని వెనక్కి తీసుకోవడానికి ‘రీఓక్/ రీకాల్’ అని పిలిచే ఆప్షన్ ఒకటి వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా సందేశాలే కాకుండా వీడియోలు – జిప్ ఫైల్స్ – డాక్యుమెంట్స్ – స్టేటస్ రిప్లైస్ కూడా వెనుకకు తీసుకోవచ్చు. ఎలా అంటే….

ఈ ఆప్షన్ ద్వారా మనం పంపిన మెసేజ్ అవతలి వ్యక్తి చూడనంతవరకు.. అంటే మనకు డబుల్ బ్లూ టిక్ కనిపించనంత వరకు మనం ఆ మెసేజ్ ని డిలీట్ చేయడం/వెనక్కి తీసుకోవడం చేయొచ్చు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఆప్షన్ అక్టోబర్ నుంచి అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్  ఇప్పటికే మనదేశానికే చెందిన టెలిగ్రామ్ లో అందుబాటులో ఉంది. వైబర్ లో కూడా ఉంది. ఇప్పుడు వాట్సాప్ లో కూడా అందుబాటులోకి వస్తే పొరపాటున పంపిన సందేశాలను ఫొటోలను వెంటనే వెనుకకు తీసుకోవచ్చు.

More from my site

Comments

comments