చావైనా బ్రతుకైనా నీతోనే అనుకున్నా.. నాని నిన్ను కోరి ట్రైలర్..!

ఆడియెన్స్ పల్స్ తెలుసుకున్న నాచురల్ స్టార్ నాని మరో పక్కా హిట్ సినిమాతో వస్తున్నాడు. అదేంటి రిలీజ్ కాకుండానే హిట్ ఎలా అంటారు అంటే నాని ఎంచుకునే కథలు ఆ సినిమాల్లోని దమ్ము అలాంటిది.. ఎప్పటికి బోర్ కొట్టని యూనివర్సల్ సబ్జెక్ట్ ప్రేమకథలతో నాని తీస్తున్న సినిమా ప్రేక్షకులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ప్రస్తుతం నాని శివ నిర్వాణ డైరక్షన్ లో నిన్ను కోరి సినిమా తీస్తున్నాడు.

జూలై 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. తననే ప్రేమించా.. “తననే పెళ్లిచేసుకోవాలనుకున్నా.. చావైనా బ్రతుకైనా తనతోనే అనుకున్నా” అని నాని విరహ వేదనతో చెబుతున్న డైలాగ్ సిని ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పక్కా లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో డైలాగ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది.

నానితో నివేదా థామస్ జంటగా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నాడు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ప్రేమ పరవశంలో మునిగితేలేలా చేస్తుందట. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని నిన్ను కోరితో ఎలాంటి ఫలితం అందుకుంటాడో తెల్సుకోవాలంటే జూలై 7 దాకా వెయిట్ చేయాల్సిందే.

More from my site

Comments

comments