పార్లమెంట్ కి వెళ్లి ఫోటోలు దిగడం మినహా సాధించింది ఏముంది ?

అభిమానులను పదేపదే కొట్టడం, అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఎన్నికల్లో బహిరంగంగా డబ్బులు పంచడం ద్వారా ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బాలకృష్ణ… ఇప్పుడు మరోసారి తన అహంకారాన్ని బయటపెట్టారు. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  బాలకృష్ణ… రాజకీయాలు చేయడం సులువు కాదన్నారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చారు.. మరింత మందిని రావాల్సిందిగా మీరు ఆహ్వానిస్తారా అని ప్రశ్నించగా… తాను ఎవరికీ పిలుపునివ్వనన్నారు.  రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన అమితాబచ్చన్, చిరంజీవి ఏం పీకారని ప్రశ్నించారు. రాజకీయాలంటే ఎమోషన్‌ కాదన్నారు. రాజకీయం ఎన్టీఆర్‌ వల్లే సాధ్యమైందన్నారు. అమితాబచ్చన్ రాజకీయాల్లోకి  వచ్చి ఉత్తరప్రదేశ్‌లో గొప్ప నాయకుడైన బహుగుణను ఓడించారన్నారు.

అంత చేస్తే పార్లమెంట్‌కు వెళ్లి ఫొటోలు దిగడం మినహా అమితాబచ్చన్ సాధించింది ఏముందని ప్రశ్నించారు. చిరంజీవి గురించి మాట్లాడుతూ ఏం పీకారు అన్నట్టు సైగలు చేశారు బాలకృష్ణ. అందరూ రాజకీయాల్లో రాణించలేరని కావాలంటే తాను రాసిస్తానన్నారు. మరి మీ సంగతేంటని ప్రశ్నించగా… బాలకృష్ణ వంశ పురాణం చెప్పారు.  మేము వేరు, నా బ్లడ్‌ వేరు, మా బ్రీడ్ వేరు, ఎన్ని సార్లయినా ప్రజల్లోకి వెళ్లి గెలిచే దమ్ము ఉంది మాలో అంటూ  వ్యాఖ్యానించారు బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పెద్ద చర్చే జరుగుతోంది. నెటిజన్లు బాలకృష్ణ వ్యాఖ్యల పట్ల నెగిటివ్‌గా స్పందిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించడం ఒక్క బాలకృష్ణకే చెల్లిందని ఎద్దేవా చేస్తున్నారు.

More from my site

Comments

comments