ఎన్టీఆర్-బన్నీ ఎక్ఛేంజ్…ఎవరి జడ్జ్‌మెంట్ రైటో చూడాలి

NTR-Allu-Arjun

తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్స్. అలాగే కష్టం విషయంలో కూడా ఎవరికీ ఎవరూ తీసిపోరు. వాళ్ళే ఎన్టీఆర్-బన్నీ. ఇద్దరూ కూడా కష్టపడి పైకొచ్చినవాళ్ళే. వాళ్ళకంటూ ఓ స్థాయిని క్రియేట్ చేసుకున్నవాళ్ళే. వీళ్ళిద్దరి ఆన్‌స్క్రీన్ హీరోయిజం, బాక్స్ ఆఫీస్ యుద్ధాలు ఇప్పటికే చూసేశాం. కలెక్షన్స్ సాధించే విషయంలో ఎవరు బెస్టో కూడా ఆల్రెడీ తేలిపోయింది. ఇక ఇప్పుడు ఆఫ్‌స్క్రీన్ హీరో ఎవరు? ఎవరి జడ్జ్‌మెంట్ కరెక్ట్? కథల ఎంపికలో ఎవరి సామర్థ్యం ఎంత అనే విషయం చూడాలి.

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా టైంలోనే అల్లు అర్జున్‌కి రెండు కథలు వినిపించాడు త్రివిక్రమ్. అయితే బన్నీ మాత్రం సన్నాఫ్ సత్యమూర్తినే ఫైనల్ చేశాడు. ఆ రెండో కథకు నో చెప్పాడు. అయితే త్రివిక్రమ్ మాత్రం ఆ కథను పూర్తిగా పక్కన పెట్టెయ్యలేదు. ఆ కథను మహేష్‌కి తగ్గట్టుగా మార్చి మహేష్‌కి వినిపించాడు. మహేష్ ఏం చెప్పాడు అనే విషయం అయితే తెలియలేదు కానీ మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తుందనుకున్న మహేష్-25వ సినిమా కాస్తా వంశీ పైడిపల్లి చేతికి వెళ్ళింది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్‌తో టచ్‌లోకి వెళ్ళిన త్రివిక్రమ్ ఎన్టీఆర్‌కి కూడా రెండు కథలు వినిపించాడట. అయితే ఎన్టీఆర్ మాత్రం బన్నీ రిజెక్ట్ చేసిన కథ…..మహేష్ కూడా డ్రాప్ చేసిన కథనే ఫైనల్ చేశాడట. ఇప్పుడు అదే కథకు మెరుగులు దిద్దుతున్నాడు త్రివిక్రమ్. ఈ కథా చర్చల్లో ఎన్టీఆర్ కూడా అప్పుడప్పుడూ పాల్గొంటూ ఉన్నాడు.

మరోవైపు ఎన్టీఆర్‌కి టెంపర్ లాంటి సూపర్ హిట్ కథలు ఇచ్చిన వక్కంతం వంశీ ఎన్టీఆర్ కోసం ఓ పవర్ఫుల్ కథను రెడీ చేశాడు. ఇనీషియల్‌గా ఎన్టీఆర్‌కి కూడా ఆ కథ నచ్చింది కానీ ఆ తర్వాత మాత్రం ఎందుకో వక్కంతం వంశీని పక్కన పెట్టేశాడు. కట్ చేస్తే బన్నీ దగ్గర తేలాడు వంశీ. బన్నీ వెంటనే ఒకె చేసేశాడు. ఇప్పుడు వంశీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు కూడా కొబ్బరికాయ కొట్టేశాడు బన్నీ. అలా బన్నీ చేయాల్సిన కథ ఎన్టీఆర్ చేతికి వచ్చింది…..ఎన్టీఆర్ చేయాల్సిన కథ బన్నీకి వచ్చింది. మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా సూపర్ హిట్ అవుతుందో చూడాలి మరి. రెండు సినిమాలూ హిట్ అయితే ఒకె గానీ ఒకటి హిట్ అయ్యి మరొకటి ఫట్ అయితే మాత్రం కథల ఎంపిక విషయంలో ఎన్టీఆర్-బన్నీలలో ఎవరు కరెక్ట్ అన్న విషయం తేలిపోతుంది. హీరోలకు మంచి కథలు సెలక్ట్ చేసుకోవడం కంటే ఆఫ్ స్క్రీన్ హీరోయిజం ఏం ఉంటుంది? ఆ ఆఫ్‌స్క్రీన్ హీరోయిజంలో హీరో ఎవరో తేలిపోతుంది? బాక్స్ ఆఫీస్‌ని ఎవరు బద్ధలు కొడతారో చూడాలి మరి.

Related News

Comments

comments