కార్తీక మాసంలో ఎన్టీఆర్ సినిమా ప్రారంభం….

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రపై వచ్చే సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరిగిపోతోంది. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ స్వయంగా తన తండ్రి పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం గురించి బాలయ్య కొన్ని కీలక ప్రకటన చేశారు. ప్రముఖ దర్శకుడు తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

బాలయ్య ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు అంటే వచ్చే ఏడాది మే 28 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దర్శకుడు తేజ ప్రస్తుతం స్క్రిప్ట్ మరియు చిత్రానికి సంబంధించిన ఇతర పనుల్లో బిజీగా ఉన్నారు. కాగా ఈచిత్రం త్వరలో కార్తీక మాసం సందర్భంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి బాలకృష్ణ తో సహా సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.

More from my site

Comments

comments