ఎన్టీఆర్ చాలా పెంచుకోవాలి …కాజల్ షాకింగ్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , NTR , ప్రభాస్ లంటే అంతులేని అభిమానాన్ని కురిపిస్తారు ఏ హీరోయిన్ అయినా …… కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ఈ నలుగురు హీరో లపై కామెంట్ చేసి సంచలనం సృష్టించింది . విచిత్రం ఏంటంటే ఈ భామ ఈ నలుగురు హీరోలతో కూడా నటించింది . అయితే వాళ్ళ గురించి నెగెటివ్ ధోరణి లో కామెంట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది . ఇక సదరు హీరోల అభిమానులైతే కాజల్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.

అన్నింటికంటే విచిత్రం ఏంటంటే …….. ప్రభాస్ కి ఇంకా ఎనర్జీ కావాలట ! ప్రభాస్ ని చూడగానే దేహదారుఢ్యం తో బాహుబలి లా కనిపిస్తాడు కానీ అతడికి ఇంకా ఎనర్జీ కావాలని కామెంట్ చేసింది కాజల్ . పవన్ కళ్యాణ్ కు కొన్ని సమయాల్లో మాట్లాడటం రాదని , ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని …… మహేష్ విషయానికి వస్తే అతడు ఓ చాటర్ బాక్స్ …….. కొన్నిసార్లు మాట్లాడటం ఆపేయాలి అని అంది . ఇక NTR హైపర్ యాక్టివిటీ ని పెంచుకోవాలి అంటూ ఓ ట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొంది కాజల్ అగర్వాల్ . ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి . ఇక ఆ హీరోల అభిమానులు కాజల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More from my site

Comments

comments