టాప్ 10 జాబితాలో ఎన్టీఆర్

టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఏ హీరో కూడా సాధించలేనన్ని హిట్స్ జూనియర్ ఎన్టీఆర్ సాధించాడు. టెంపర్ చిత్రంతో మొదలు పెట్టిన జైత్రయాత్ర నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ నుంచి మొన్న విడుదలైన జై లవకుశ వరకు నిర్విరామంగా సాగింది. అంతేకాకుండా తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షోతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా దేశంలోనే కాకుండా టాలీవుడ్‌లోని టాప్ 10 సంపన్నుల జాబితాలో ఎన్టీఆర్ చేరిపోయాడనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది. ఈ వార్త సారాంశం ఏమిటంటే…….

జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్మీ ప్రణతి సాక్షాత్తు లక్ష్మీ దేవి పుత్రికేనండి. ప్రముఖ వ్యాపారవేత్త, నార్నే ఎస్టేట్స్, స్టూడియో ఎన్ అధినేత నార్నే శ్రీనివాసరావు కుమార్తె. ఆవిడ పేరుమీద మహాబలిపురం, ఫిలింనగర్, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ తదితర ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయట. అంతేకాకుండా ఎన్టీఆర్ పేరిట కూడా భారీ మొత్తంలోనే ఆస్తులు ఉన్నట్టు సమాచారమట. తాత ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా తండ్రి నుంచి వచ్చిన ఆస్తి రూ.450 కోట్లు అని ఓ కథనంలో వెల్లడించారని ఆ వార్త కథనం.

అయితే ఎన్టీఆర్‌కు సంబంధించిన ఆస్తుల వివరాలు నిజామా? అబద్దమా అనే విషయంపై చర్చ జరుగుతున్నది. అయితే ప్రముఖుల ఆస్తుల వివరాలు చాలా గోప్యంగా ఉంటాయనేది అందరికీ తెలిసిందే. తారక్ ఆస్తుల వివరాలు ఎక్కడ నుంచి వచ్చాయి అనేదానికి ఆధారం లేదు. కనుక ఈ వివరాలు నమ్మాలా వద్దా అనే విషయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

More from my site

Comments

comments