సెంచరీతో రికార్డు సృష్టించిన ఎన్టీఆర్ ‘జై లవకుశ’

జూనియర్ ఎన్టీఆర్ – బాబీల “జై లవకుశ” సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. జై లవకుశ చిత్ర విడుదలకు వారం సమయం కూడా లేకపోవడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఎలా నటించాడనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది. సినిమాపై ఏర్పడిన భారీ హైప్ ని దృష్టిలో పెట్టుకుని అదే స్థాయిలో ఎక్కువ థియేటర్స్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. జై లవకుశ సినిమా కేవలం హైదరాబాద్ లోనే 100 స్క్రీన్ లలో రిలీజ్ అవుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా ఓ రికార్డే.

ఎన్టీర్ కు అన్ని ఏరియాలలో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం నైజాం ఏరియాలో చిత్ర వసూళ్లు ఎక్కువగా ఉండనున్నాయి. మిగిలిన ఏరియాలలో కూడా ఈ సినిమా ఎక్కువ స్క్రీన్ లలోనే విడుదల అవుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న  ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించగా నివేద థామస్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

More from my site

Comments

comments