ఎన్టీఆర్ పార్టీ….ఎన్టీఆర్ మేనేజర్‌కి చాలా పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది

ntr-party

నవ భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ పేరుతో ఓ లెటర్ హెడ్. ఆ క్రిందనే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ పేరు. ఆ క్రిందనే ఎన్టీఆర్ ఆఫీస్ అడ్రస్. అది చాలదా సంచలనం అవడానికి. అది కూడా ఎన్టీఆర్ ఎవరికి పోటీ అవుతాడని చంద్రబాబు భయపడ్డాడో…..ఆ లోకేష్ మంత్రిగా ప్రమోట్ అయిన టైంలోనే ఈ న్యూస్ ప్రచారంలోకి రావడం మరి కాస్త సంచలనం అయింది. స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీని మళ్ళీ నందమూరి వారసుల చేతిలోకి తీసుకుని వచ్చే సత్తా ఉన్న ఒకే ఒక్కడు ఎన్టీఆర్ అని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. అలాంటి ఎన్టీఆర్ ఎప్పటికీ టిడిపిని వదిలే ఛాన్సే లేదు. ఊపిరి ఉన్నంత వరకూ తాత స్థాపించిన పార్టీని వదిలిపెట్టేది లేదని, పార్టీ కోసం ఎప్పుడైనా, ఏమైనా చేయడానికి రెడీ అని ఇప్పటికే చాలా సార్లు చెప్పి ఉన్నాడు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ సొంతంగా కొత్త పార్టీ పెట్టాడు అనే అర్థం వచ్చేలా ….ఎన్టీఆర్‌ ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసమే దొంగ ప్రచారానికి తెరలేపారు. ఈ ప్రచారంతో ఎన్టీఆర్‌కి వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. ఎంతో కష్టపడి ఎన్టీఆర్ సాధించుకున్న ఇమేజ్‌ని ఇలాంటి పిల్ల చేష్టలు ఎప్పటికీ టచ్ చేయలేవు. కానీ ఎన్టీఆర్ మేనేజర్‌కి మాత్రం ఈ ఇష్యూతో చాలా పెద్ద చిక్కే వచ్చిపడిందట.

సోషల్ మీడియా జనాల నుంచి, తెలుగు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జనాలందరూ కూడా ఎన్టీఆర్ మేనేజర్‌కి ఫోన్స్ చేసి విసిగించారట. ఆరాలు తీశారట. ఈ విషయంలో నేషనల్ మీడియా జనాలు కూడా ఎన్టీఆర్ మేనేజర్‌కి కాల్ చేసి ఎన్టీఆర్‌తో ఇంటర్యూ ఇప్పించమని అడిగారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కొత్త పొలిటికల్ పార్టీ స్థాపించాడు అనే విషయంపైన ఎన్టీఆర్ స్పందనను తెలుసుకోవడానికి మీడియా ఆ స్థాయిలో పాట్లు పడిందట. ఇక కొంతమంది నాయకులు కూడా ఎన్టీఆర్ మేనేజర్‌కి కాల్స్ చేసి ఆరాలు తీశారట. మొత్తానికి ఎన్టీఆర్ పార్టీ అన్న ఫేక్ న్యూస్ ప్రచారంలోకి వచ్చిన తర్వాత నుంచీ ఎన్టీఆర్ మేనేజర్‌కి నిద్రే లేకుండా పోయిందట. మరోవైపు ఎన్టీఆర్ మాత్రం ….టెంపర్ తర్వాత నుంచీ సినిమా కెరీర్ సినిమా సినిమాకూ నెక్ట్స్ లెవెల్‌కి వెళ్తున్న నేపథ్యం…….వరుస హిట్స్ నేపథ్యంలో ఇలాంటి ఫేక్ ప్రచారాలు మామూలే. అలాగే రాజకీయంగా కూడా ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా ప్రచారం చేశారు. ఏకంగా జగన్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అనే స్థాయిలో ప్రచారం చేశారు. వాటన్నింటి ముందు ఈ అబద్ధపు ప్రచారం ఎంత? అని చెప్పి లైట్ తీసుకోమని మేనేజర్‌కి చెప్పాడట. అది కూడా జై లవకుశ సినిమాను చాలా సీరియస్‌గా తీసుకున్నాడు ఎన్టీఆర్. తాత నందమూరి తారక రామారావు పేరు మీద ఉన్న నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్‌ని ఇండస్ట్రీలో ఒన్ ఆఫ్ ది టాప్ బేనర్‌గా నిలబెట్టాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. అలాంటి టైంలో ఇలాంటి సిల్లీ ఇష్యూస్ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం అన్న అభిప్రాయంలో కూడా ఎన్టీఆర్ ఉన్నాడట. కానీ ఎక్కడా కూడా పాలిటిక్స్‌ తెలియదని కానీ, పాలిటిక్స్‌లోకి రాను అని కానీ ఎన్టీఆర్ చెప్పకపోడం నందమూరి అభిమానులు సంతోషపరుస్తోంది. ఎప్పటికైనా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీని మళ్ళీ నందమూరి వారి చేతుల్లోకి తీసుకురావాలని ఆశించేవాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు మరి.

Related News

Comments

comments