పొలిటికల్ పార్టీ…ఎన్టీఆర్ షాకింగ్ రెస్పాన్స్

ntr

2009 ఎన్నికల్లో ప్రచారం చేయకముందు వరకూ ఎన్టీఆర్‌పైన జరిగిన నెగిటివ్ ప్రచారం చాలా చాలా తక్కువ. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే సినిమా మీడియా తప్ప పొలిటికల్ జర్నలిస్టులు తారక్‌ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ చంద్రబాబుకు అవసరమైన సమయంలో ….చంద్రబాబు అభ్యర్థన మేరకు…తాత స్థాపించిన టిడిపిని గెలిపించాలన్న ఉద్ధేశ్యంతో రాజకీయ రణరంగంలో అడుగుపెట్టాడు ఎన్టీఆర్. రావడం రావడమే సునామీనే సృష్టించాడు. టిడిపి అనుకూల మీడియాతో పాటు అన్ని మీడియా సంస్థలు కూడా ఎన్టీఆర్ వాగ్ధాటిని ప్రశంశించక తప్పని పరిస్థితి. ఎన్టీఆర్‌లానే ఖాకీ చొక్కా ధరించిన తారక్….ఆ ఎన్నికల్లో ప్రచారం చేసిన సినిమా హీరోలు…రాజకీయ నాయకులు అందరికంటే ఎక్కువ పేరుతెచ్చుకున్నాడు. అలాగే ఇచ్చిన మాట కోసం ప్రాణాల మీదకు కూడా తెచ్చుకునేంత కమిట్మెంట్ తారక్‌కి ఉందని అందరికీ అదే అర్థమైంది. ఆ పట్టుదలను చూసే చంద్రబాబు భయపడ్డాడు. స్కిల్స్ విషయంలోనూ, పట్టుదలగా హార్డ్ వర్క్ చేసే విషయంలోనూ తారక్ ముందు లోకేష్ నిలవలేడు అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక అప్పటి నుంచీ ఎన్టీఆర్‌ని ఎన్నిరకాలుగా టార్గెట్ చేయాలో అన్ని రకాలుగానూ టార్గెట్ చేసింది ఒక వర్గం మీడియా. సొంత కులానికే నందమూరి వారసుడిని దూరం చేయాలనుకున్నారు. నందమూరి కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్‌ని దూరం చేశారు. లేనిపోని అభూత కల్పనలతో జగన్ మనిషి అన్న ముద్రవేసేశారు. తీరా ఎన్టీఆర్‌ని కలిసి అసలు విషయం ఏంటి అని ఆరా తీస్తే…ఎన్టీఆర్ చెప్పిన మాట ఒక్కటే…….తాత స్థాపించిన టిడిపిని బొందిలో ప్రాణం ఉండగా వీడబోను……నా రక్తంలోనే నందమూరి కుటుంబం మొత్తం ఉంది……నేను ఎవరికోసమో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఇక ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ అంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించమని కోరగా………సింపుల్‌గా ఓ నవ్వు నవ్వేశాడు తారక్. అదే ఎన్టీఆర్ స్పందన. ఆ నవ్వులోనే బోలెడన్ని అర్థాలు కనిపించాయి. ఇలాంటి వార్తలకు కూడా నేను స్పందించాలా అన్న అర్థం ఉంది. రాష్ట్రంలో ఎవరు ఏమి మాట్లాడినా…..ఏం జరిగినా స్పందిస్తూ ఉండడమంటే అలాంటి వాటికి లేని ప్రాధాన్యం ఇచ్చినట్టు….అది నాకు ఇష్టం లేదు అన్న అర్థం ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఇచ్చిన ఈ స్మైల్‌ తర్వాత అయినా ఎన్టీఆర్ గురించి అవాకులు చెవాకులు పేలే మీడియావాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారేమో చూడాలి. నిజంగా నాయకుడిగా ఎన్టీఆర్ రంగంలోకి దిగితే ఆ హంగామా మామూలుగా ఉండదురా స్వామీ…..ఈ రాతలన్నీ కూడా ఆ తుఫానులో కొట్టుకుపోయేలా ఉంటుంది. బోలెడంత మంది మరుగుజ్జు నాయకులు అడ్రస్ లేకుండా పోయేలా ఉంటుంది. సినిమాల్లో తాత వారసత్వాన్ని నిలబెడుతున్న ఎన్టీఆర్…….అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పింస్తున్న ఎన్టీఆర్…..పొలిటికల్‌గా కూడా అదే స్థాయి హంగామా సృష్టించడు అన్న డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా?

Related News

Comments

comments