పడిపోయిన ఎన్టీఆర్ ర్యాంక్ – అభిమానుల ఆవేదన

మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ అన్నంతపని చేశాడు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని తీవ్రంగా బాధపెట్టాడు. నిన్నటిదాకా వాళ్లంతా లైట్ తీసుకుంటే.. వరుణ్ మాత్రం పూర్తిగా సీరియస్ అయిపోయి వారి ‘లైట్’ పగిలేలా చేశాడు. దీంతో.. అతనిపై తారక్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందనే మీ సందేహం. పదండి.. ఆ వివరాలేంటో మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం.. వరుణ్ లేటెస్ట్ మూవీ ‘ఫిదా’ బాక్సాఫీస్‌తో ఓ ఆటాడుకుంటున్న విషయం అందరికీ తెలుసు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు యూఎస్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. స్టార్ హీరోలకి సైతం కలగానే మిగిలిపోతున్న 2 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి సులభంగా చేరిపోయిందంటే, ఈ సినిమాకి అక్కడి అభిమానులు కూడా ఎంతలా ఫిదా అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఫిదా సినిమా ఆ క్లబ్ లోకి చేరగానే ఎన్టీఆర్ అభిమానుల గుండెల్లో గుబులు మొదలైంది.

తమ అభిమాన నటుడు టాలీ వుడ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాతో సాధించిన అల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ($2,022,392) ఫిదా సినిమా ఎక్కడ బీట్ చేస్తుందోనని ఆందోళన చెందారు. ఆ ఆందోళనని నిజం చేస్తూ వరుణ్ తేజ్ సునాయాసంగా ‘నాన్నకు ప్రేమతో ‘ రికార్డ్ ని బీట్ చేసింది. ట్రేడ్ వర్గాల, సినిమా అనలిస్టుల లెక్కల ప్రకారం ..’ఫిదా ‘ సినిమా యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద $2,022,514 వసూలు చేసింది. దీంతో ‘నాన్నకు ప్రేమతో’ రికార్డ్ పటాపంచలు అయిపోగా, టాప్ లో ఏడవ స్థానానికి పడిపోయింది. ఫిదా 6 వ ర్యాంక్ సొంతం చేసుకొంది. ఇప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకెళ్తుండడం గమనార్హం.

More from my site

Comments

comments