12మంది సెలబ్రిటీలు.. 60 కెమెరాలు.. 71 రోజులు… ఏం జరుగుతుందో ఎన్టీఆర్ తో చూసేద్దాం..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర మీద కనిపించబోతున్న బిగ్ బాస్ షోపై రోజు రోజుకి అంచనాలు పెరిగి పోతున్నాయి. లేటెస్ట్ గా ఈ ప్రోగ్రాం ఎలా ఉండబోతుంది అన్న విషయం క్లారిటీ ఇస్తూ ఓ టీజర్ రిలీజ్ చేశారు. 12 మంది సెలబ్రిటీలు, 60 కెమెరాలు, 24 గంటలు, 71 రోజులు ఇలా ఎన్.టి.ఆర్ చెప్పడం చూసి ప్రోగ్రాం మీద మరింత క్యూరియాసిటీ పెంచుకుంటున్నారు బుల్లితెర ఆడియెన్స్.

24 గంటలు వారంతా ఒకే ఇంట్లో.. కొట్టుకుంటారో.. తిట్టుకుంటారో.. ద్వేషించుకుంటారో ప్రేమించుకుంటారో.. చూసేద్దాం మీతో పాటు నేను ఎదురుచూస్తున్నా అందరం కలిసే చూద్దాం అంటున్నాడు తారక్. సూట్ లుక్ లో లేటెస్ట్ బిగ్ బాస్ టీజర్ తో తారక్ ప్రోగ్రాం కాన్సెప్ట్ వివరించాడు. ఇక ఇందులో కనిపించే సెలబ్రిటీస్ ఎవరు అన్నది ఇప్పటికి సస్పెన్స్ గానే ఉంది.

జూలై 16న స్టార్ మాలో తెలుగు బిగ్ బాస్ టెలికాస్ట్ కానుంది. మొదటిసారి స్టార్ రేంజ్ లో ఉన్న యువ నటుడు తారక్ బుల్లితెరపై కనిపించబోతున్నాడు. ఈ రియాలిటీ షో కోసం తారక్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ మా భారీ రెమ్యునరేషన్ ఇవ్వడంతో బిగ్ బాస్ గా ఎన్.టి.ఆర్ అవతరించడం జరిగింది. మరి బుల్లితెర బిగ్ బాస్ ఎలా తన విజృంభన సాగిస్తాడో చూడాలి.

More from my site

Comments

comments