ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాకి హీరోయిన్ దొరికింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా జై లవకుశ తో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే . ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు ఎన్టీఆర్ , కాగా ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి సమాయత్తం కానున్నాడు . అయితే అనుకున్న సమయానికంటే కాస్త ఆలస్యంగా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్రీ అయ్యాడు కానీ ఇంకా త్రివిక్రమ్ ఫ్రీ కాలేదు . ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు . దాన్ని కంప్లీట్ చేశాక అప్పుడు ఎన్టీఆర్ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్తాడు.

అయితే ఈ సినిమాలో నటించే ప్రధాన తారాగణం ని ఒక్కొక్కరిగా ఎంపిక చేస్తూనే ఉన్నారు . తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం బ్రిటీష్ హాట్ భామ ” అమీ జాక్సన్ ”ని ఎంపిక చేశారట ఒక హీరోయిన్ గా . ఇప్పటికే ఈ భామ నటించిన సినిమాల కంటే ఒంపు సొంపులను అతిగా ప్రదర్శించి పేరుగాంచింది. ఇక ఎన్టీఆర్ -త్రివిక్రమ్ ల సినిమాలో కనుక ఛాన్స్ కొట్టేస్తే మరో హిట్ సినిమా లభించినట్లే అమీ జాక్సన్ కి .

Comments

comments