‘ఒక్కడు మిగిలాడు’ ట్వీట్ రివ్యూ

11:28 AM : ఆసక్తికరమైన మనోజ్ పోరాటం ముగిసింది. చిత్రం పూర్తయింది.

11:23 AM : ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనోజ్ విప్లవం తీసుకుని వచ్చాడు. ఉత్కంఠ భరితమైన క్లైమాక్స్ సన్నివేశం వస్తోంది.

11:16 AM : చిత్రం మళ్లీ వెనక్కు వెళ్ళింది. 20 వ శతాబ్దానికి సంబంధించిన సమస్యలని చూపిస్తున్నారు. చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది.

11:12 AM : ఎట్టకేలకు ప్రయాణికులకు కొంత ఉపశమనం కలిగింది. వారికి కొంత సాయం అందింది.

11:08 AM : ప్రజల పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ఎమోషనల్ సీన్స్ ప్రస్తుతం వస్తున్నాయి.

10:57 AM : పడవలో ఒక్కొక్కరుగా చనిపోతున్న వైనాన్ని చాలా ఉద్వేగభరితంగా చూపిస్తున్నారు.

10:48 AM : నడి సముద్రంలో ప్రయాణిస్తున్న వారి ఇబ్బందులని చూపిస్తున్నారు.

10:40 AM : ఇంటర్వల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. మనోజ్ కొంత మంది శరణార్ధులని తీసుకుని పడవలో బయలుదేరాడు. భయంకరమైన పడవ ప్రయాణాన్ని చూపిస్తున్నారు.

10:25 AM : ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : చిత్రం ఇప్పటి వరకు చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. మనోజ్ నటన హైలైట్ గా నిలిచింది. ద్వితీయార్థం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

10:20 AM : ఇప్పుడు ఇంటర్వెల్ ఫైట్ మొదలైంది. శరణార్ధులని రక్షించడానికి మనోజ్ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఇంటర్వెల్.

10:14 AM : చిత్ర కథ మరింత ఉత్కంఠ భరితంగా మారింది. కథ మొత్తం శ్రీలంక లోని శరణార్థులకు, ఆర్మీకి మధ్య జరుగుతోంది. చిత్రం ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.

10:05 AM : శ్రీలంక ఆర్మీకి మనోజ్ కి మధ్య అద్భుతమైన ఫైట్ సీన్ వస్తోంది. ఫైట్ లో మనోజ్ హీరోయిజాన్ని చూపిస్తున్నారు.

09:54 AM : ఎల్ టి టి ఈ హెడ్ ప్రభాకరన్ గా మనోజ్ మరో పాత్రలో కనిపిస్తున్నాడు. విప్లవాత్మక భావాలతో మనోజ్ ని చూపిస్తున్నారు.

09:45 AM : చిత్రం శ్రీలంకకు మారింది. శ్రీలంకకు వలస వెళ్లిన వారి పోరాటాలని చూపిస్తున్నారు.

09:38 AM : హీరోయిన్ అనీషా రిపోర్టర్ గా ఎంట్రీ ఇచ్చింది.నటుడు మురళి మోహన్ కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యారు.

09:33 AM : చిత్రం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది. మనోజ్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తున్నాడు. విద్యార్థుల తరుపున వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నాడు.

09:23 AM : జైలులో ఖైదీగా మనోజ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రారంభ సన్నివేశం నుంచే సీరియస్ వాతావరణం నెలకొనివుంది.

09:20 AM : చిత్రం నారా రోహిత్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది.

09:10 AM : చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.

More from my site

Comments

comments