‘పైసా వసూల్’ మూవీ రివ్యూ

Review : పైసా వసూల్

Rating : 3.25/5

Casting : నందమూరి బాలకృష్ణ, శ్రియ, కైరాదత్, విక్రం జీత్ విర్క్, కబీర్ బేడి….

Music : అనూప్ రుబెన్స్

D.O.P : ముఖేష్ G

Editor: జునైద్ సిద్ధిక్

Producer: భవ్య క్రియేషన్స్

Story, Dialogues, Screen play, Direction: పూరి జగన్నాధ్

Release Date : 01. 09. 2017

Introduction: బాలయ్య సినిమా అంటే ఆయన అభిమానులకు పూనకం వస్తుంది.అలాగే పూరి జగన్నాధ్ సినిమాలో డైలాగులు,హీరో క్యారక్టరైజేషన్ అన్నా ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది ప్రేక్షకులలో.అటువంటి ఇద్ధరు హేమాహేమీల కలయికలో వస్తున్న సినిమా అంటే అంచనాలు కూడా ఆకాశంలోనే ఉంటాయి.ఈ “పైసా వసూల్” సినిమా ట్రైలర్స్ ఇప్పటికే ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయి.అభిమానులైతే “తేడాసింగ్” పాత్రలో బాలయ్యను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉన్నారు.”గౌతమీ పుత్ర శాతకర్ణి” తో హిట్ కొట్టి బాలయ్య మంచి ఊపులో ఉండగా,వరుస ఫ్లాపులతో పూరి జగన్నాధ్ కొంచెం వెనుకబడి ఉన్నాడు.ఈసారి బాలయ్య సక్సెస్ ట్రాక్ కొనసాగిందా లేక పూరి ఫ్లాపుల టోపీలో మరొక ఈక వచ్చి చేరిందా అనేది చూద్దాం పదండి.

Story : కథగా చెప్పాలంటే ఇందులో గొప్ప మలుపులూ, సరికొత్త మెరుపులూ లేవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదొక James Bond లాంటి కథ. జేమ్స్ బాండ్ రకరకాల టాస్క్ ల మీద ఎలాగైతే మారువేషాల్లో వెళతాడో ఇదీ అంతే. తేడా సింగ్ అనేవాడు తేడా తేడా గా బిహేవ్ చేస్తూ అందరి దృష్టిలో పడతాడు. చాలా డేరింగ్ డాషింగ్ గా ఎవరితోనైనా తలపడుతుంటాడు. Bob Marlo అనే ఇంటర్నేషనల్ డాన్ ని తుదముట్టించడం కోసం ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తుంటుంది. ఆ టాస్క్ కోసం తేడా సింగ్ ని ఉపయోగించుకోవాలని చూస్తుంది. మరి తేడా సింగ్ ఆ టాస్క్ ఒప్పుకున్నాడా ? ఇంతకూ తేడా సింగ్ ఎవరు? ఎందుకింత తేడా గా బిహేవ్ చేస్తుంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘పైసా వసూల్’ చూడాల్సిందే.

Performance : సినిమాలు హిట్స్ కావచ్చు లేక్ ఫ్లాప్ కావచ్చు.కాని నటన పరంగా బాలకృష్ణ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. దానికి ఈ “పైసా వసూల్” మినహాయింపేమీ కాదు.ఒక్క మాటలో చెప్పాలంటే పూరి మార్కు హీరో పాత్రలో బాలయ్య నటన అభిమానులతో ఈలలు వేయించడం ఖాయం,అభిమానులు కాని వాళ్ళను కూడా అలరించడం ఖాయం.బాలకృష్ణ ‘తేడా సింగ్’ గా చాలా బాగా చేసాడు. ఆయన ఇప్పటివరకూ ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు కూడా.పేరుకి తగ్గట్టుగానే తేడా తేడా గా నటిస్తూ తేడా సింగ్ పాత్రలో బాలకృష్ణ బ్రహ్మాండం గా ఒదిగిపోయారు. శాతకర్ణి గా రాజసం చూపించింది ఈయనేనా అనే ఆశ్చర్యం కలుగుతుంది. శ్రియ , ముస్కాన్ , కైరా దత్ లు ఉన్నంతలో పర్వాలేదనిపించారు. కబీర్ బేడీ, విక్రంజీత్ లు ఆయా పాత్రల్లో ఫ్రెష్ గా అనిపించారు.ఆలీ కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు.

Technical : ఈ మధ్య కాలంలో పూరి జగన్నాధ్ నుంచి వచ్చిన సినిమాలలో ఎక్కువశాతం బాక్సాఫీస్ వద్ద బోర్లాపడ్డాయి.అతని చివరి సినిమా “రోగ్” అయితే మరీ దారుణంగా కనీస స్థాయి బిజినెస్ కూడా జరగని పరిస్థితి.అవన్నీ దృష్టిలో పెట్టుకునే పూరి ఈ సినిమా విషయంలో జాగ్రత్తపడ్డాడనిపిస్తుంది. ఎక్కడా తడబాటు లేకుండా తన మార్క్ స్పీడ్ టేకింగ్ తో సినిమా ని చక చక పరుగెత్తించాడు. తన అంబుల పొది లో ప్రధాన అస్త్ర మైన Hero క్యారక్టర్యజేషన్ , ఆటిట్యూడ్ నే మళ్ళీ నమ్ముకొని ఈ సినిమా తీసాడు. బాలకృష్ణ ను ఇలా చూపించొచ్చని ఎవరూ ఊహించని విధంగా తీసాడు. Mukhesh ఫోటోగ్రఫీ , ఈ సినిమా కి మంచి ఎస్సెట్. ఇక అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఈ సినిమా కి మెయిన్ పిల్లర్. పాటలన్నీ బాగున్నాయి. రీ-రికార్డింగ్ కూడా బాగుంది.

Highlights : బాలకృష్ణ,

డైలాగులు,

పూరి మార్క్ హీరోయిజం

Drawbacks : కథ రొటీన్ కావడం,

కామెడీ పెద్దగా పండకపోవడం

Analysis : కథ మీద కన్నా కథనం మీద ఆధార పడ్డ సినిమా ఇది . కేవలం Hero క్యారక్టర్యజేషన్ మీద బేస్ అయ్యి పూరి ఈ స్టోరీ తయారు చేసుకున్నాడనిపిస్తుంది. ఆ విషయం లో పూరి సక్సెస్ అయ్యాడు కూడా.ఫైట్స్ లో కానీ, డైలాగ్స్ చెప్పడంలో కానీ, డబల్ జోష్ కనిపిస్తుంది. NTR ‘జీవిత చక్రం’ సినిమాలోని ‘కంటిచూపు చెబుతోంది’ పాటను ఇందులో రీమిక్స్ చేసారు. ఆ పాటలో ఫస్ట్ టైమ్ బాలకృష్ణ తన తండ్రి లా స్టెప్స్ వేయడానికి ప్రయత్నించారు. ఈ పాటకు ఫాన్స్ పరవళ్లు తొక్కడం ఖాయం. సినిమా మొత్తం బాలకృష్ణ వన్ మాన్ షో లాగా నడిపించేసాడు. మొత్తానికి ఈ మధ్య కాలంలోని పూరి ట్రాక్ రికార్డ్ ని దృష్టిలో పెట్టుకుని భయపడుతున్న అభిమానులకు భారీ విందుభోజనాన్ని అందివ్వలేకపోయినా,అర్ధాకలితో అయితే పంపించలేదు పూరి జగన్నాధ్.అభిమానులకైతే సూపర్,అభిమానులు కానివాళ్ళకు కూడా బాగుందనిపించే సినిమానిచ్చాడు పూరి.

Bottom line : నిజంగా ఇది “పైసా వసూల్”

Audience opinion : హమ్మయ్య…పూరి మళ్ళీ హిట్ కొట్టాడు

More from my site

Comments

comments