నందమూరి ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో పైసా వసూల్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా పైసా వసూల్. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీయా హీరోయిన్ గా నటిస్తుంది. క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ కు ఓ కొత్త థ్రిల్ ఇస్తుందని చెబుతున్నారు చిత్రయూనిట్.

ఈ నెల 28న ఈ సినిమా టీజర్ రిలీజ్ కాకుంది. అయితే టీజర్ టైటిల్ గా స్టంపర్ 101 అని ప్రమోట్ చేస్తున్నారు. బాలయ్య చేసే ఫైట్స్, డ్యాన్స్, డైలాగ్స్ ప్రతి ఒక్కటి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు. సెప్టెంబర్ 29న రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతుండగా అంతకంటే ముందే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకోవాలని చూస్తున్నాడు పూరి జగన్నాధ్.

శాతకర్ణి సినిమా తర్వాత అంచనాలను మించేలా పూరితో సినిమా చేస్తున్నారు బాలయ్య బాబు. పైసా వసూల్ లో డాన్ క్యారక్టర్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాలోని బాలయ్య స్టైలిష్ స్టిల్స్ కూడా ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని తెప్పిస్తున్నాయి. మరి టీజర్ తో సినిమా రేంజ్ చూపించడానికి సిద్ధమైన పైసా వసూల్ టీం ఎలాంటి టీజర్ తో ప్రేక్షకులా ముందుకు వస్తారో చూడాలి.

More from my site

Comments

comments