పటేల్ సర్ : రివ్యూ

రేటింగ్ : 2/5

హీరోగా ఎన్నో సూపర్ హిట్లు అందుకున్న జగపతి బాబు లెజెండ్ తో విలన్ గా కొత్త అవతారం ఎత్తాడు. ఇక అప్పటి నుండి వరుసగా కుదిరితే విలన్ లేదంటే సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మంచి ఫాంలో ఉన్నాడు. ఇక ఇప్పుడు మరోసారి జగపతి బాబు హీరోగా నటించిన సినిమా పటేల్ సర్. వాసు పరిమి డైరెక్ట్ చేసిన ఈ సినిమా వారాహి చలన చిత్ర బ్యానర్లో నిర్మించబడింది.

కథ విషయానికొస్తే.. ఆర్మీ రిటైర్డ్ అయిన సుభాష్ పటేల్ (జగపతి బాబు) ఎన్నో గట్స్ ఉన్న వ్యక్తి. అలాంటి పటేల్ దేవరాజ్ (కబీర్ సింగ్) అతని గ్యాంగ్ ను చంపాలనుకుంటాడు. అతని పగ తీరేలా విలన్ గ్యాంగ్ లో ఒక్కొక్కరిని దారుణంగా చంపుతూ వస్తుంటాడు పటేల్. ఈ మర్డర్లు ఎందుకు చేస్తున్నాడు అన్న విషయం తెలుసుకోవడం కోసం కేథరిన్ (తన్య హోప్) పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. అసలు ఇంతకీ పటేల్ విలన్లను ఎందుకు చంపుతున్నాడు..? పటేల్ దేవరాజ్ కు పత గొడవలేంటి..? చివరికి దేవ రాజ్ ను పటేల్ ఏం చేశాడు అన్నది అసలు కథ.

జగపతి బాబు పర్ఫార్మెస్ హైలెట్ అని చెప్పొచ్చు. కథలో అటు తన వయసుకి తగ్గ పాత్రతో పాటుగా రెండు పాత్రలలో తన మార్క్ నటనతో మెప్పించాడు జగ్గు భాయ్. సినిమాలో జగపతి బాబు స్టైల్.. వేరియేషన్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఇక విలన్ గా కబీర్ సింగ్, పృధ్వి, ప్రభాకర్ నటన పర్వాలేదు. హీరోయిన్స్ పద్మప్రియ, తన్య హోప్ చేసిన చిన్న పాత్రలైనా ఆకట్టుకున్నారు. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

వాసు పరిమి రాసుకున్న కథ రొటీన్ గానే సాగింది. కథనంలో అక్కడక్కడ ట్విస్టులు బాగున్నాయి. ముఖ్యంగా ఇంటర్వల్ సీన్, క్లైమాక్స్ లు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. అయితే కథనంపై ఇంకా వర్క్ చేస్తే సినిమా ఇంకా బాగా వచ్చేది. సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్ పర్వాలేదు. ఎడిటింగ్ కాస్త ట్రిం చేయొచ్చనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథ కథనంలో దర్శకుడు ఓకే అనిపించుకున్నా రొటీన్ సినిమా అన్న భావన రాకుండా చూసుకుంటే బాగుండేది.

బాటం లైన్ :

జగపతి బాబు కోసమే పటేల్ సర్..!

More from my site

Comments

comments