పవన్ ఛాన్స్ కోసం వెయిటింగ్.. మరో గబ్బర్ సింగ్ తీస్తాడా..!

క్రేజీ డైరక్టర్ హరిష్ శంకర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం సినిమా చేశాడు. సినిమా టాక్ ఎలా ఉన్నా బన్నిని స్టైలిష్ లుక్ లో చూపించి ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు హరిష్ శంకర్. కథ కథనాల్లో ఇంకాస్త కొత్తదనం చూపించి ఉంటే బాగుండేది అనిపించింది. అయితే డిజె ప్రమోషన్స్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేశాడు హరిష్ శంకర్. తాను పవన్ కళ్యాణ్ కు వీరభిమానినని చెబుతూనే గబ్బర్ సింగ్ లాంటి కథ పవర్ స్టార్ కోసం సిద్ధంగా ఉందని అంటున్నాడు.

ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలే త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్న పవన్ హరిష్ శంకర్ కు డైరక్షన్ ఛాన్స్ ఇస్తాడా అని డౌట్ పడుతున్నారు. ఇక డిజె రిజల్ట్ చూశాక హరిష్ శంకర్ తో పవర్ స్టార్ సినిమా తీయకపోవడమే మంచిదని అంటున్నారు. గబ్బర్ సింగ్ తో పవర్ స్టార్ ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించిన హరిష్ రొటీన్ స్టోరీస్ కాకుండా కొత్తగా ట్రై చేస్తేనే ఇక ముందు కూడా అవకాశాలొస్తాయి. ప్రస్తుతం స్టార్ హీరోలు కూడా కొత్త ప్రయోగాలకు సిద్ధం అంటున్నారు మరి అలాంటిది రొటీన్ కథలతో ఎందుకు హరిష్ సినిమాలు తీయడం అంటున్నారు విమర్శకులు.

More from my site

Comments

comments