పవర్ స్టార్ కాటమరాయుడు ఫైనల్ కలెక్షన్స్ ఫుల్ డిటెయిల్స్

pawan kalyan katamarayudu final collections

సర్దార్ గబ్బర్‌సింగ్ లాంటి డిజాస్టర్ తర్వాత వచ్చిన కాటమరాయుడు పైన పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా భారీ హోప్స్ పెట్టుకున్నారు. టీజర్‌తో, టైటిల్‌తో మురిపించిన కాటమరాయుడు ట్రైలర్, సాంగ్స్‌తో మాత్రం నిరుత్సాహపరిచాడు. దానికి తగ్గట్టుగానే ఫైనల్ కలెక్షన్స్ కూడా డిసప్పాయింట్ చేశాయి. పవన్‌ని నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ మరోసారి నష్టపోయారు. అయితే అందులో కూడా ఒక పాజిటివ్ విషయం ఉండడం గమనార్హం. మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కాటమరాయుడు సినిమాతో కూడా దాదాపు 62. 15 కోట్ల షేర్ రాబట్టాడు పవన్. ట్రైలర్ బాగాలేదు. సాంగ్స్ బాగాలేవు. సినిమాపైన హోప్స్ క్రియేట్ చేయడంలో పూర్తిగా డిసప్పాయింట్ చేసింది కాటమరాయుడు టీం. డైరెక్టర్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కూడా డిజాస్ట్రస్‌గా పెయిల్ అయ్యారు. హీరోయిన్ శృతీహాసన్ కూడా విమర్శలు కొనితెచ్చుకుంది.

అయినప్పటికీ 62.15 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టిందంటే మాత్రం ఇట్స్ ఒన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ మహిమ అని చెప్పుకోవాలి. దాదాపుగా చాలా మంది హీరోల సూపర్ హిట్ కలెక్షన్స్‌తో ఈ కలెక్షన్స్ సమానం. డిజాస్టర్ టాక్‌తోనే ఈ రేంజ్ రిజల్ట్ రాబట్టాడంటే…….అదే సినిమా బాగుండి ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉండేవో ఊహించుకోవచ్చు. కచ్చితంగా వంద కోట్లను క్రాస్ చేసి ఉండేదని ట్రేడ్ పండిట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక నుంచి అయినా డైరెక్టర్‌తో పాటు కథల సెలక్షన్‌లో కూడా పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. పవన్ తర్వాత సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది కాబట్టి ఆ సినిమాకు మినిమం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు…కచ్చితంగా వంద కోట్లను దాటేస్తాడనడంలో…ఇంకా ఎక్కువకు రీచ్ అవుతాడనడంలో కూడా సందేహం లేదు. పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక ఆ సినిమా కోసం వెయిట్ చెయ్యాల్సిందే.

దేశవ్యాప్తంగా కాటమరాయుడు సినిమాను 72.5 కోట్లకు అమ్మారు. పెట్టినపెట్టుబడికి ఎనభై శాతం తీసుకురావడానికే అపసోపాలు పడ్డాడు కాటమరాయుడు. ఇక ఓవర్సీస్ బయ్యర్స్‌కి అయితే 6.5 కోట్ల నష్టాన్ని మిగిల్చాడు కాటమరాయుడు.

కలెక్షన్స్ డిటెయిల్స్ః (కోట్లలో)

నైజాంః 15

సీడెడ్ః 8.26

యుఎః 6.26

గుంటూరుః 4.97

ఈస్ట్ః 5.35

వెస్ట్ః 4.22

కృష్ణాః 3.69

నెల్లూరుః 2.10

ఎపి/టిఎస్ః 50.25

కర్ణాటక, తమిళనాడు, నార్త్ ఇండియాః 6.55

ఓవర్సీస్ః 5.35

వరల్డ్ వైడ్ః 62.15 కోట్లు

Comments

comments